E-Paper
Advertisement

Bengaluru Woman: రక్తంతో ప్రేమ లేఖ.. తనను కాదంటే గుట్టు బయటపెడతా? పోలీసు అధికారికి ఓ మహిళ వార్నింగ్

Bengaluru Woman: రక్తంతో ప్రేమ లేఖ.. తనను కాదంటే గుట్టు బయటపెడతా? పోలీసు అధికారికి ఓ మహిళ వార్నింగ్
Advertisement

Bengaluru Woman: ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నప్పుడు చాలామంది అధికారులు.. మహిళలకు దూరంగా ఉంటారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వారి నుంచి ఏమైనా సమస్యలు వస్తే.. తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తుంటారు. ఆ పోలీసు అధికారి అదే చేశాడు. కాకపోతే ఓ మహిళతో పరిచయం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చివరకు ఆ మహిళపై కేసు నమోదు అయ్యింది. అసలు మేటరేంటి?

బెంగుళురులో పోలీసు అధికారిని వేధించిన మహిళ

Advertisement

బెంగళూరులో ఓ మహిళ.. విధుల్లో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను వేధించింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆ అధికారి పనికి పదే పదే అంతరాయం కలిగించింది. తనతో సంబంధం పెట్టుకోకుంటే ప్రాణాలను తీసుకుంటానని, నీ గుట్టు బయటపెడతానని బెదిరించింది. ఆ అధికారి ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు అయ్యింది.

అక్టోబర్ చివరలో బెంగుళూరు సిటీలోని రామమూర్తినగర పోలీసు‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ పని చేస్తున్నారు సతీష్‌. ఆ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికే చెందిన సంజనా అలియాస్‌ వనజా ఒకానొక సందర్భంలో సతీష్‌తో మాట్లాడారట. ఆ విషయం ఆ అధికారి ఎప్పుడో మరిచిపోయారు.

Advertisement

నా దారికి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటా

కొద్ది రోజుల తర్వాత అంటే అక్టోబర్ చివరలో సతీష్ పర్సనల్ ఫోన్‌కు నిరంరం వాట్సాప్ కాల్ రావడం మొదలైంది. ఓసారి ఫోన్ లిప్ట్ చేసిన ఆయనకు..  ఆమె ఏవేవో చెప్పారు.  మరో రోజు కూడా అదే కంటిన్యూ అయ్యింది. తాను కాంగ్రెస్ కార్యకర్తనని.. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించడం మొదలుపెట్టింది.

సీనియర్ రాజకీయ నాయకులతో ఆమె దిగిర ఫోటోలు పంపింది కూడా. నిన్ను ప్రేమిస్తున్నానని అంటూ ప్రారంభించిందట. ఫోన్‌లో ఆయన సున్నితంగా హెచ్చరించే ప్రయత్నం చేశారట. అయినా వనజ ఫోన్ చేయడం మానలేదు. చివరకు విసిగిపోయిన ఆ పోలీసు అధికారి, నెంబర్‌ బ్లాక్‌ చేశారు. మరొక నెంబర్‌తో ఫోన్ చేయడం మొదలుపెట్టింది.

ALSO READ: మల్కాజ్‌గిరిలో చిన్నారి మృతి కేసులో షాకింగ్ నిజాలు

ఎన్ని చేసినా ఆయన పట్టంచుకోలేదు. పరిస్థితి గమనించి వనజా నేరుగా ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ పని చేస్తున్న స్టేషన్‌కు రక్తంలో రాసిన ఓ లేఖ పంపింది. తనను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన్ని హెచ్చరించింది. ఈ మహిళ వ్యవహారం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. డిసెంబర్ 12న నేరుగా స్టేషన్ కు మరోసారి వచ్చింది వనజా.

పోలీసు అధికారితో గొడవకు దిగింది. తనను కాదంటే.. నీ గుట్టు రట్టు చేస్తానని, పరువు తీస్తానంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. పరిస్థితి గమనించిన సతీష్.. తన ఠాణాలో ఆమెపై ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద ఆమెపై కేసు చేశారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×