E-Paper
Advertisement

Jeera Water Benefits: గ్లాసు జీరా వాటర్‌లో బోలెడు హెల్త్ సీక్రెట్స్.. శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు!

Jeera Water Benefits: గ్లాసు జీరా వాటర్‌లో బోలెడు హెల్త్ సీక్రెట్స్.. శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు!
Advertisement

Jeera Water Benefits: మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీని వల్ల రుచి మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యాన్ని సైతం సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీలకర్ర ఎంతగానో తోడ్పుతుంది. ముఖ్యంగా దీనిలోని విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని చెడు వ్యర్థాలను బయటకు పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో జీరా వాటర్ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు అనేకం:

జీలకర్రను మన భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. ఈ గింజల్లో పోషకాల సమృద్ధిగా ఉంటాయి. అలాగే జీలకర్ర ద్వారా ఫైబర్, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, ఇనుము, జింక్, విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టి.. మరుసటి రోజున ఆ నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇమ్యూనిటీ బూస్టర్:

Advertisement

ముఖ్యంగా రాత్ని నాటబెట్టిన జీలకర్ర నీటిలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ ఉండటం వలన.. ఇది మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం వరకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీలకర్ర నీరు తాగడం వలన గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది:

నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. అలాగే జీలకర్ర నీరు జీవక్రియను చురుకుగా ఉంచి, శరీరంలో అదనంగా పేరుకుపోయే కొవ్వు‌ను నెమ్మదిగా కరిగించేస్తుంది. దీంతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ఇతర ప్రయోజనాలు:

Advertisement

* జీరా వాటర్‌లోని సహజ గుణాలు కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు శరీరంలోని తేలికపాటి నొప్పులు, తిమ్మిరి, అసౌకర్యం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఈ చలికాలంలో తరచూ జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు వచ్చే వారికి జీరా వాటర్ కొంత రక్షణగా నిలుస్తుంది. ఉదయం పూట జీలకర్ర నీరు శరీరాన్ని తాజాగా ఉంచడంలో తోడ్పడుతుంది. నీటి సమతుల్యత మెరుగుపడటంతో రోజంతా చురుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది.

* రాత్రి పుడకునే ముందు ఒక టీస్పూన్ జీలకర్రను ఓ గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచాక ఆ నీటిని తేలికగా మరిగించి, వడకట్టి గోరువెచ్చగా ఖాళీ కడుపుతో తాగాలి.

 

 

 

 

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×