E-Paper
Advertisement

Kitchen Cleaning Tips: వంటగది మెరుస్తూ ఉండాలంటే.. ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి

Kitchen Cleaning Tips: వంటగది మెరుస్తూ ఉండాలంటే.. ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి

Kitchen Cleaning Tips: వంటగది ఇంటికి చాలా ముఖ్యం. ఇది ఎంత శుభ్రంగా ఉంటే.. మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇదిలా ఉంటే వంటింట్లో.. వంటకాలు తయారు చేయడం వల్ల పేరుకు పోయే జిడ్డు, మరకలు, చెడు వాసనను తొలగించడానికి కొన్ని సులభమైన, సమర్థవంతమైన పద్ధతులు తప్పకుండా పాటించాలి. ఇవి మీ కిచెన్‌ను తెల్లగా మెరిసేలా చేస్తాయి. ఇందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలనే.. విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. కౌంటర్‌టాప్‌లు, ప్లాట్‌ఫామ్‌ శుభ్రత:
వంట చేయగానే మొదట చేయాల్సింది. గ్యాస్ దగ్గర ఉన్న ఫ్లాట్ ఫామ్ శుభ్రం చేయడం. ఇందుకోసం వేడి నీరు సబ్బు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వేడి నీరు + సబ్బు: వంట చేసిన వెంటనే.. కౌంటర్‌టాప్‌పై పడిన ఆహార పదార్థాలు, నూనె మరకలను వేడి నీరు , కొద్దిగా డిష్‌వాషింగ్ సబ్బు కలిపిన లిక్విడ్‌తో తుడవండి. వేడి నీరు జిడ్డును కరిగించడానికి సహాయ పడుతుంది. అంతే కాకుండా మంచి వాసనను కూడా అందిస్తుంది.

వెనిగర్ : జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటే.. ఒక స్ప్రే బాటిల్‌లో సగం నీరు, సగం వైట్ వెనిగర్ కలిపి స్ప్రే చేసి.. 5 నిమిషాలు ఆగి తుడిచేయండి. ఇది క్రిములను చంపుతుంది. అంతే కాకుండా సహజమైన మెరుపును ఇస్తుంది.

2. సింక్, డ్రైనేజీ శుభ్రత:
సింక్ ఎప్పుడూ మెరిసిపోతూ ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించాలి.

బేకింగ్ సోడా మ్యాజిక్: సింక్‌లో మరకలు, దుర్వాసన ఉంటే.. బేకింగ్ సోడా (వంట సోడా) చల్లి, నిమ్మరసంతో రుద్దండి. ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల సింక్ మెరుస్తుంది.

డ్రైనేజీ క్లియరింగ్: డ్రైనేజీలో వాసన వస్తే.. అందులో ఒక కప్పు బేకింగ్ సోడా వేసి, ఆపై ఒక కప్పు వెనిగర్ వేయండి. నురుగు వచ్చి శుభ్రం చేస్తుంది. అరగంట తర్వాత వేడి నీరు పోయండి.

3. స్టవ్, బర్నర్స్ శుభ్రం చేయండి:
గ్యాస్ స్టవ్ లేదా హాబ్‌పై పేరుకుపోయే జిడ్డును తొలగించడం చాలా ముఖ్యం.

నిమ్మరసం + ఉప్పు: స్టవ్‌పై గట్టిగా పేరుకుపోయిన జిడ్డు మరకలపై కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి రుద్దండి. ఇది మరకలను సులభంగా తొలగిస్తుంది.

బర్నర్స్ శుభ్రత: బర్నర్లను తీసి.. వేడి నీరు, డిష్‌వాష్ లిక్విడ్ , కొద్దిగా వెనిగర్ కలిపిన ద్రావణంలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం బ్రష్‌తో రుద్ది కడగాలి. అవి కొత్తవాటిలా మెరుస్తాయి.

4. మైక్రోవేవ్, ఓవెన్ శుభ్రత:
ఓవెన్ లోపలి భాగం జిడ్డు పట్టి, వాసన వస్తుంది.

ఆవిరి పద్ధతి: ఒక గిన్నెలో నీరు, కొన్ని నిమ్మకాయ ముక్కలు లేదా వెనిగర్ వేసి మైక్రోవేవ్‌లో 5 నిమిషాలు వేడి చేయండి. లోపలంతా ఆవిరి పేరుకుపోతుంది. తర్వాత మెత్తని గుడ్డతో సులభంగా తుడిచేయవచ్చు.

5. రిఫ్రిజిరేటర్ శుభ్రత:
ఫ్రిజ్‌లోని దుర్వాసనను తొలగించడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది.

శుభ్రం చేసే లిక్విడ్ : ఫ్రిజ్‌ను గోరువెచ్చని నీరు, బేకింగ్ సోడా కలిపిన లిక్విడ్‌తో తుడవండి. ఇది వాసనలను తొలగిస్తుంది. ఫ్రిజ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే శుభ్రం చేయండి. లేదంటే షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

దుర్వాసన : ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా లేదా కాఫీ పౌడర్ పోసి ఫ్రిజ్‌లో ఒక మూలన పెట్టండి. ఇది ఫ్రిజ్ లోని చెడు వాసనలను పీల్చుకుంటుంది.

6. మరిన్ని ముఖ్యమైన చిట్కాలు:
ప్రతిరోజూ క్లీనింగ్: పెద్ద పనిగా పెట్టుకోకుండా.. వంట చేసిన వెంటనే అప్పటికప్పుడు ఫోర్ మొత్తం తుడిచేయడం అలవాటు చేసుకోండి.

హోం రెమెడీస్: బ్లీచ్ వంటి కఠినమైన రసాయనాలకు బదులుగా.. వెనిగర్ , బేకింగ్ సోడా వంటి సహజంగా శుభ్రపరిచే సాధనాలను ఉపయోగించండి. ఇవి ఆరోగ్యానికి సురక్షితం.

చెత్త తొలగింపు: చెత్తబుట్టను నిండిన వెంటనే బయట పడేయండి.

ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ వంటగదిని కేవలం శుభ్రంగానే కాక.. ఆహ్లాదకరంగా ఉంచుకోవచ్చు.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×