E-Paper
Advertisement

లేఆఫ్ తర్వాత.. రెండేళ్ల కొడుకుతో ఆఫీసుకెళ్లిన ఉద్యోగి, చివరికి ఓ నిజం తెలుసుకున్నాడు

లేఆఫ్ తర్వాత.. రెండేళ్ల కొడుకుతో ఆఫీసుకెళ్లిన ఉద్యోగి, చివరికి ఓ నిజం తెలుసుకున్నాడు
Advertisement

ఏఐ రాకతో ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఉన్నట్టుండి ఉపాధి కోల్పోవడం వల్ల.. నరకయాతన అనుభవిస్తున్నారు. అన్ని రోజులు కంపెనీ కోసం శ్రమించిన ఆ ఉద్యోగులకు కనీసం గౌరవం కూడా దక్కడం లేదు. ఇందుకు బెంగళూరులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

ఉద్యోగుల్లో కొందరు చాలా సిన్సియర్‌గా కంపెనీ కోసం పనిచేస్తుంటారు. షిఫ్టులు, లీవ్స్, వీకాఫ్స్ మరిచిపోయి మరీ శ్రమిస్తుంటారు. పనిలో పడి కుటుంబాన్ని మరిచిపోయే ఉద్యోగులు కూడా ఉంటారు. అయితే, జీవితంలో పని ఒక్కటే ముఖ్యం కాదని.. కుటుంబం కూడా అవసరమే అనే సంగతి తెలిసేందుకు ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే.. కంపెనీని మీరు సొంతంగా భావించవచ్చు. కానీ, ఆ సంస్థకు మీ అవసరం తీరాక మీతో ఎలాంటి పని ఉండదు. ఇటీవల లేఆఫ్‌లో ఉద్యోగాన్ని కోల్పోయిన ఓ టెక్కీ సోషల్ మీడియా వేదికగా ఇదే చెప్పాడు.

రెండేళ్ల బిడ్డను ఆఫీసులోకి అనుమతించని సెక్యూరిటీ

Advertisement

బెంగళూరుకు చెందిన ఆ ఉద్యోగి ఇటీవల అకస్మాత్తుగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఎగ్జిట్ ప్రాసెస్ పూర్తి చేసి, కంపెనీ ల్యాప్‌టాప్‌ను ఆఫీస్‌లో తిరిగి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చివరి రోజు.. తన రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకుని ఆఫీసుకు వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య ఆఫీసుకు వెళ్లడంతో ఇంట్లో తన బిడ్డను చూసుకోడానికి ఎవరూ లేరు. దీంతో తనతోపాటే ఆఫీసుకు తీసుకెళ్లాడు. అయితే, ఆఫీసు ఎంట్రెన్స్‌లోనే సెక్యూరిటీ గార్డు అతడిని ఆపేశాడు. పిల్లలను ఆఫీస్ లోపలికి అనుమతించమని చెప్పాడు. కేవలం ఐదు నిమిషాల్లోనే పని అయిపోతుందని, ల్యాప్ టాప్ ఇచ్చేసి వచ్చేస్తానని చెప్పినా.. ఆ సెక్యూరిటీ గార్డు వినలేదు. దీంతో తన సహోద్యోగికి ఫోన్ చేసి సహాయం కోరాడు. పిల్లాడిని అతడికి అప్పగించి ఆఫీస్ లోపలికి వెళ్లాడు.

కంపెనీకి ఉద్యోగి.. ఒక ఒప్పందం మాత్రమే

ఐదు నిమిషాల్లో పూర్తి చేయాల్సిన ప్రాసెస్‌కు 15 నిమిషాలు పట్టింది. అప్పటివరకు తన రెండేళ్ల చిన్నారి బయట నాన్న కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. అప్పుడే అతడి కళ్లు తెరుచుకున్నాయి. ఎన్నో ఏళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి, కంపెనీ కోసం సమయాన్ని వెచ్చించిన ఆ ఉద్యోగికి ఈ ఘటన ఒక జీవితం పాఠంగా నిలిచింది. కంపెనీకి ఉద్యోగం కేవలం ఒక ఒప్పందం మాత్రమేనని, మనం ఎంత సిన్సియర్‌గా పనిచేసినా.. వారికి అదొక వ్యాపార సంబంధం మాత్రమేనని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఉద్యోగం ఊడగానే.. ఆఫీస్ తలుపులు మూసుకుపోతాయని తెలిపాడు. ‘‘ఉద్యోగమే జీవితం కాదు.. వ్యక్తిగత జీవితానికి, ఆఫీస్ పనికి మధ్య కొంత ఎమోషనల్ డిస్టెన్స్ పాటించడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.

కష్టసమయంలో తోడుండేది కుటుంబమే

Advertisement

కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు మనకు తోడుగా నిలిచేది కుటుంబం మాత్రమేనని అతడు పేర్కొన్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలని తెలిపాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమ అనుభవాలను కామెంట్లలో పంచుకున్నారు. ‘‘కార్బొరేట్ వ్యవస్థలో మనం కేవలం ఒక ఎంప్లాయ్ ఐడీ మాత్రమే. మీ శ్రమను ఆఫీసుకే పరిమితం చేయండి. కుటుంబానికి కూడా తగిన సమయం కేటాయించండి’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. పిల్లల పెంపకం.. ఉద్యోగ ఒత్తిడి మధ్య నలిగిపోయే ప్రతీ వర్కింగ్ పేరెంట్‌కు ఈ పరిస్థితి ఒక నిదర్శనమని మరో నెటిజన్ తెలిపాడు. మరి మీకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? అతడు ఎదుర్కొన్న పరిస్థితిపై మీరేమంటారు?

Also Read: ఈ 7 రకాల వ్యక్తులతో గొడవపడితే మీకే నష్టం.. వీరితో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు

Tags

Related News

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!

దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!

ప్రసవం తరువాత పెరిగిన బరువు తగ్గాలా? ఇంట్లోనే సులభంగా ఈ 3 వ్యాయామాలు చేయండి

ఈ 7 రకాల వ్యక్తులతో గొడవపడితే మీకే నష్టం.. వీరితో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు

గంజాయి, డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతున్నారా? ఈ దురలవాటు మానేయడానికి మార్గాలివే

ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×