Rag Mayur:టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు యువ నటుడు రాగ్ మయూర్ (Rag Mayur). ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆయన పేరు గట్టిగా మార్మోగిపోతోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గరివిడి లక్ష్మి’లో ఆయన పోషించిన సత్తిబాబు పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా రాగ్ మయూర్ చూపించిన అసాధారణ నటన ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
‘గరివిడి లక్ష్మి’ అనేది ఒక భావోద్వేగభరితమైన మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా. ఇలాంటి పవర్‌ఫుల్ సినిమాలో సత్తిబాబు లాంటి సవాలుతో కూడిన పాత్రను ఒప్పుకోవడం రాగ్ మయూర్‌లోని నటుడికి నిజమైన అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ కథలో అక్కడి ప్రాంతీయ యాసను ఎంతో సహజంగా ఒంటబట్టించుకోవడమే కాకుండా, ఒక సంప్రదాయ కళారూపానికి అవసరమైన హావభావాలను పలికించి సత్తిబాబు పాత్రకు ప్రాణం పోశారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సత్తిబాబు పాత్రలో కనిపించే వయసుకు సంబంధించిన మేకోవర్ మరియు బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్. కేవలం ముఖానికి మేకప్ వేస్తే సరిపోదని భావించిన రాగ్ మయూర్, వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో వచ్చే ప్రతి చిన్న మార్పును ఎంతో నిశితంగా పరిశీలించి తెరపై ఆవిష్కరించారు. ఇక యువకుడిగా ఉన్నప్పుడు ఉండే ఆ చురుకుదనం, ఉత్సాహం.. వయసు పెరిగిన తర్వాత వచ్చే నెమ్మదితనాన్ని తన శరీర భాషతోనే పర్ఫెక్ట్‌గా చూపించారు.
వయసు పెరిగిన పాత్రను చేయాలంటే నడకలో వేగం, నిలబడే తీరు, భుజాల కదలిక, చూపులోని తీవ్రత, మాట్లాడేటప్పుడు కనిపించే ఆత్మవిశ్వాసం.. ఇలా ప్రతి అంశం వయసుకు తగ్గట్టుగా మారాలి. రాగ్ మయూర్ సత్తిబాబు పాత్రలోని వేర్వేరు దశలను ఎంతో సహజంగా అలవర్చుకున్నారు. ఇక దీంతో ఒకే నటుడు తెరపై కనిపిస్తున్నప్పటికీ, పాత్రలో వచ్చిన మార్పులను ప్రేక్షకులు ఎంతో సులభంగా నమ్మి ఆ పాత్రలో లీనమైపోతున్నారు.
also read:‘ఫౌజీ’లో నేతాజీగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?
దర్శకుడు నిర్దేశించిన పాత్ర స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, తెరపై అంకితభావంతో రాగ్ మయూర్ చేసిన ఈ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. నటుడిగా తన పరిణతిని నిరూపించుకుంటూ, ఒక సంప్రదాయ కళాకారుడి జీవితంలోని వేర్వేరు దశలకు సరైన న్యాయం చేసినందుకు గాను ఆయనకు సినీ ప్రముఖులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇక మొత్తానికి చూస్తే, రొటీన్ మాస్ సినిమాల వైపు వెళ్లకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న రాగ్ మయూర్.. ‘గరివిడి లక్ష్మి’ సినిమాతో తన కెరీర్‌లో మరొక గొప్ప మైలురాయిని అందుకున్నారు. ఇక వయసుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చి మెప్పించిన ఆయన నటన, రాబోయే రోజుల్లో ఆయనను టాలీవుడ్‌లో మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో సందేహం లేదు.