Diwali Preparation Tips: దీపావళి అంటేనే ఇంటినిండా దీపాల వెలుగులు, కొత్త బట్టల సందడి, నోరూరించే పిండి వంటలు, కుటుంబ సభ్యులతో సరదా గడిపే క్షణాలు. అయితే, పండగ దగ్గర పడే కొద్దీ పనుల హడావుడి కూడా పెరిగిపోతుంటుంది. చుట్టాలు ముందే వచ్చేయడం, అతిథులకు ఏం పెట్టాలో తెలియక కంగారు పడటం, చివరి నిమిషంలో గిఫ్ట్స్ కొనడం.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఈ హడావుడిలో పండగను ఆస్వాదించే సమయమే తగ్గిపోతుంది. అందుకే ఈసారి చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా.. కొన్ని పనులను ముందే చక్కబెట్టుకుంటే సరిపోతుంది. ఇంటి అలంకరణ నుంచి స్నాక్స్, గిఫ్ట్స్ వరకు కాస్త ప్లాన్ చేసుకుంటే ఎలాంటి కంగారు లేకుండా పండగను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి, దీపావళికి ముందే పూర్తి చేయాల్సిన ఆ 5 పనులేంటో చూసేద్దామా?
పండగ పూట హాల్, డైనింగ్ రూమ్, ఎంట్రన్స్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. అనవసరమైన చెత్తనంతా తీసేసి ఇల్లంతా నీట్‌గా సర్దుకుంటే ఇంటికి వచ్చే అతిథులకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. ముగ్గులు, పూలతో పాటు చిన్న చిన్న దీపాలు పెట్టుకుంటే చాలు ఇల్లంతా కొత్త కళ సంతరించుకుంటుంది. ఈసారి ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా కలపతో చేసిన ట్రేలు, వెదురు బాస్కెట్లు లేదా ఉతికేందుకు సులువుగా ఉండే కాటన్ వస్తువులను వాడితే ఇంటి లుక్కే మారిపోతుంది.
పండగ రోజు ఉదయం నుంచి వంటగదిలోనే ఉండిపోతే ఎలా? అందుకే రోజూవారీ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, మురుకులు, మఖానా వంటివి ముందుగానే చేసి ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. స్టీల్ డబ్బాలు లేదా గాజు జార్లలో వీటిని పెడితే ఎప్పటికీ తాజాగా ఉంటాయి. ఎవరైనా అనుకోకుండా బంధువులు ఇంటికి వస్తే హడావుడిగా వంటగదిలోకి పరుగెత్తకుండా, చిటికెలో స్నాక్స్, కాఫీ అందించడానికి వీలుగా ఈ ఏర్పాట్లు ముందే చేసుకుంటే పండగ పూట మనకూ కాస్త రెస్ట్ దొరుకుతుంది.
Also Read: ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!
దీపావళి అంటేనే చుట్టాలు, స్నేహితులు, పక్కింటి వాళ్ల రాకపోకలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఎవరైనా సడన్‌గా ఇంటికి వస్తే అప్పుడు కప్పులు వెతకడం, గ్లాసులు కడగడం లాంటి పనులు పెట్టుకోకుండా కొన్ని ఎక్స్‌ట్రా గ్లాసులు, వాటర్ జగ్గులు, కప్పులు, సర్వింగ్ ట్రేలను ఎప్పుడూ చేతికి అందే దూరంలో ఉంచుకోవాలి. స్టీల్ లేదా చెక్కతో చేసిన సామాన్లు అయితే పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు. పైగా శుభ్రం చేయడం కూడా చాలా సులభం.
ఆఫీస్ ఫ్రెండ్స్‌కి, బంధువులకు గిఫ్ట్స్ ఇవ్వడం దీపావళిలో చాలా ముఖ్యమైన పార్ట్. కానీ లాస్ట్ మినిట్‌లో ఏది పడితే అది కొనడం కంటే.. ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుందో ఒక చిన్న లిస్ట్ రాసుకుని ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మంచిది. కేవలం స్వీట్లు, డ్రై ఫ్రూట్ బాక్సులు కాకుండా ఈసారి కాస్త కొత్తగా ఆలోచించి అందమైన సర్వింగ్ గిన్నెలు, స్టీల్ బాటిల్స్, ఇండోర్ ప్లాంట్లు లేదా మంచి హోమ్ డెకార్ ఐటమ్స్ గిఫ్ట్‌గా ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు.
అతిథులు ఇంటికి రాగానే హడావుడిగా అన్నీ చేయడం కంటే.. డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లు, నాప్‌కిన్లు, గ్లాసులు అన్నీ ముందుగానే సర్ది పెట్టుకోవడం మంచిది. సింపుల్‌గా రోజూ వాడే క్రాకరీకి చిన్న చిన్న పండగ అలంకరణలు జత చేస్తే టేబుల్ చాలా అందంగా కనిపిస్తుంది. అతిథులతో మాట్లాడటానికి, నవ్వుతూ గడపడానికి కాస్త సమయం మిగులుతుంది.
Also Read: షుగర్ అదుపులో ఉండాలంటే అన్నం ఒక్కటి మానేస్తే సరిపోతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..