E-Paper
Advertisement

Padma Awards 2026: సినీ దిగ్గజాలకు.. పద్మ అవార్డులు, ఎవరెవరికి ఏయే పురస్కారాలు దక్కాయంటే?

Padma Awards 2026: సినీ దిగ్గజాలకు.. పద్మ అవార్డులు, ఎవరెవరికి ఏయే పురస్కారాలు దక్కాయంటే?
Advertisement

Padma Awards 2026: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ ప్రముఖులను వివిధ రకాల అవార్డులతో ప్రతి ఏడాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సత్కరిస్తున్న సంగతి తెలిసిందే ఇలా కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలలో పద్మ అవార్డులు ఎంతో కీలకంగా ఉంటాయి. ఈ పద్మ అవార్డులను ప్రతి ఏడాది ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మాత్రమే కాకుండా వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన వారికి పద్మ అవార్డులను అందిస్తారు. ఇక 2026 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ జాబితాలో పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ అవార్డులను అందుకోవటం గమనార్హం. ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరెవరు ఈ పద్మ అవార్డులను అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే..

పద్మ అవార్డు గ్రహీతలు..

*డాక్టర్ రాజేంద్రప్రసాద్ (పద్మశ్రీ)

Advertisement

*మురళీమోహన్ (పద్మశ్రీ)

*కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌ (పద్మశ్రీ)

Advertisement

*దివంగత నటుడు ధర్మేంద్రకు (పద్మ విభూషణ్)

* నటుడు మమ్ముట్టికి (పద్మవిభూషణ్)

* గాయ‌ని అల్కా యాజ్ఞిక్‌ (ప‌ద్మ భూష‌ణ్ )

131 మందికి పద్మ అవార్డు..

సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ సెలబ్రిటీలు పద్మ అవార్డులను అందుకోబోతున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది మొత్తంగా 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా 13 మందికి పద్మభూషణ్,5 మందికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 131 మందినీ పద్మ అవార్డులు వరించాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ఇతర రంగాలకు సంబంధించి మొత్తం 11 మంది ఎంపిక కావడం విశేషం.

కళామతల్లి సేవలో నటులు…

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, మురళి, మోహన్ ఈ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. మురళీమోహన్ గత కొన్ని దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ కళామతల్లికి ఎన్నో సేవలు చేశారు. ఇలా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఈయనకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు వరించింది . ఇక ఈయనతో పాటు రాజేంద్రప్రసాద్ కు కూడా పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మమ్ముట్టి, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా ఈ అవార్డులు రావడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పద్మ అవార్డులో అందుకున్న సెలబ్రిటీలకు అభిమానులు ఇతర సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.

Also Read: Akira Nandan: అకీరా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×