E-Paper
Advertisement

Lotus Root Benefits: వైద్యులు సైతం మెచ్చిన సహజ ఔషధం.. కమలం వేరు ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Lotus Root Benefits: వైద్యులు సైతం మెచ్చిన సహజ ఔషధం.. కమలం వేరు ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Lotus Root Benefits: తామర పువ్వు గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, అదే తామర పువ్వు వేర్లలో బోలెడు ఔషధ గుణాలు దాగున్నాయనే రహస్యం చాలామందికి తెలియదు. పూర్వం నుంచే ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యాల్లో దీనిని సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే కమలం వేరు రక్తహీనతను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. లోటస్ రూట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కమలం వేర్లతో చిప్స్, సూప్‌లు, టీ వంటి వంటకాలు తయారుచేసుకొని ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరచుకోవచ్చు.

అద్భుతమైన ప్రయోజనాలు:

1.  సాధారణంగా తామర వేరులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు జీర్ణవ్యవస్థ పనితీరును సహజంగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం అందించడానికి కూడా తామర వేరు చాలా మంచిదని నిపుణులు కూడా చెబుతుంటారు.

2. కమలం వేరులో ఐరన్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది. అంతేకాకుండా, శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.

3.  తామర వేరులో కేలరీలు చాలా తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పొట్ట త్వరగా నిండిన అనుభూతి కలుగుతుంది. ఈ వేర్లు త్వరగా ఆకలి వేయకుండా చూసి, అధికంగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

4.  ఈ వేరు ద్వారా పొటాషియం కూడా లభిస్తుంది. ఇది శరీరంలోని ద్రవాల మధ్య సమతుల్యతను సరిచేస్తుంది. అలాగే రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి, రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. కమలం వేర్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.

5. తామర వేర్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే సీజనల్‌గా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్లు, శిలీంధ్ర వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవడంలోనూ ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Related News

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

Big Stories

×