E-Paper
Advertisement

VC Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్.. త్వరలో అన్ని వివరాలు: వీసీ సజ్జనార్

VC Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్.. త్వరలో అన్ని వివరాలు: వీసీ సజ్జనార్
Advertisement

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో జరుగుతున్న పురోగతిని, తదుపరి కార్యాచరణను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని.. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, దీనిపై లోతైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు. ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలో ఉందని.. అధికారుల బృందం అన్ని కోణాల్లో ఆధారాలను సేకరిస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

సిట్ కార్యాలయం ఏర్పాటుపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విచారణ అంతా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొనసాగుతోంది. దర్యాప్తులో వెల్లడయ్యే కీలక విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైన తర్వాత ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

ALSO READ: Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస.. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? షేక్ హసీనా ఆశ్రయంపై భారత్‌లో చర్చ..!

Related News

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×