E-Paper
Advertisement

Low Haemoglobin: రక్త హీనతతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ 6 చిట్కాలతో హిమోగ్లోబిన్ పెంచుకోండి!

Low Haemoglobin: రక్త హీనతతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ 6 చిట్కాలతో హిమోగ్లోబిన్ పెంచుకోండి!
Advertisement

Low haemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల అలసట, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అయితే.. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచుకోవచ్చు. ఐరన్, విటమిన్లతో కూడిన ఆహారం రక్త ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచే.. 6 ముఖ్యమైన డైట్ చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచే 6 డైట్ చిట్కాలు:

Advertisement

1. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి:
హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఖనిజం.

ఏమి తినాలి: పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బెల్లం, వేరు శనగలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివి ఐరన్‌కు మంచి మూలాలు.

Advertisement

మాంసాహారం: చికెన్ లివర్, రెడ్ మీట్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజు వారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

2. విటమిన్-సి తీసుకోవడం పెంచండి:
మీరు ఎంత ఐరన్ తీసుకున్నా.. శరీరం దానిని గ్రహించాలంటే విటమిన్-సి అవసరం.

ఎలా పని చేస్తుంది:
ఐరన్ గ్రహణశక్తిని పెంచడంలో విటమిన్-సి కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మరసం, ఉసిరికాయ, నారింజ, స్ట్రాబెర్రీలలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటిపై.. కాస్త నిమ్మరసం చల్లుకోవడం వల్ల ప్రయోజనం రెట్టింపు అవుతుంది.

3. ఫోలిక్ యాసిడ్ మర్చిపోవద్దు:
ఎర్ర రక్త కణాల తయారీకి ఫోలిక్ యాసిడ్ (విటమిన్ B9) చాలా అవసరం. ఫోలేట్ లోపిస్తే.. హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి.

వనరులు: బీన్స్, శనగలు, వేరు శనగలు, అరటి పండ్లు ఫోలేట్‌కు మంచి వనరులు. గర్భిణీలో హిమోగ్లోబిన్ పెరగడానికి డాక్టర్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా సూచిస్తారు.

4. దానిమ్మ, బీట్‌రూట్ మేజిక్:
రక్తహీనత నివారణలో దానిమ్మ, బీట్‌రూట్ అగ్రస్థానంలో ఉంటాయి.

దానిమ్మ: ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.

బీట్‌రూట్: ఇందులో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది.

5. ఐరన్ అబ్సార్ప్షన్ నిరోధించే వాటికి దూరంగా ఉండండి:
కొన్ని ఆహార పదార్థాలు శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే.. టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే దానిని మానుకోవాలి.

ఎందుకు: టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫీన్ ఐరన్ శోషణను 50-60% వరకు తగ్గిస్తాయి. కాబట్టి.. భోజనానికి.. టీకి మధ్య కనీసం ఒక గంట విరామం ఉండేలా చూసుకోండి.

Also Read: విటమిన్ డి రిచ్ ఫుడ్స్.. ఇవి తింటే బోలెడు బెనిఫిట్స్

6. యాపిల్, పుచ్చకాయ:
యాపిల్స్ లో ఐరన్ తో పాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. “రోజుకో యాపిల్ తింటే.. డాక్టర్ అవసరం ఉండదు” అన్న మాట హిమోగ్లోబిన్ విషయంలో.. అక్షర సత్యం. అలాగే వేసవిలో పుచ్చకాయ తీసుకోవడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగు పడతాయి.

హిమోగ్లోబిన్ లోపం అనేది సరైన పోషకాహారం ద్వారా సరిచేయగలిగే.. సమస్య. పైన చెప్పిన చిట్కాలతో పాటు తగినంత వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. అయితే.. హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా తక్కువగా ఉంటే (ముఖ్యంగా 8 g/dL కంటే తక్కువ), వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×