E-Paper
Advertisement

Vitamin D: విటమిన్ డి రిచ్ ఫుడ్స్.. ఇవి తింటే బోలెడు బెనిఫిట్స్

Vitamin D: విటమిన్ డి రిచ్ ఫుడ్స్.. ఇవి తింటే బోలెడు బెనిఫిట్స్
Advertisement

Vitamin D: విటమిన్ డి మన శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని “సన్‌షైన్ విటమిన్” అని పిలుస్తారు. ఎందుకంటే సూర్యరశ్మి ద్వారా ఇది సహజంగా లభిస్తుంది. అయితే.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి ఎండ తగలడం లేదు. దీని వల్ల ఎముకల బలహీనత, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం సూర్యరశ్మి ద్వారానే కాకుండా.. కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డి పుష్కలంగా లభించే టాప్ 5 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి అధికంగా ఉండే 5 ఉత్తమ ఆహారాలు:
విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరంలో క్యాల్షియం శోషణకు అత్యంత ముఖ్యం. విటమిన్ డి లోపిస్తే.. క్యాల్షియం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో వివరంగా చూద్దాం.

Advertisement

1. కొవ్వు అధికంగా ఉండే చేపలు:
చేపలు విటమిన్ డి కి అద్భుతమైన మూలం. ముఖ్యంగా సాల్మన్ , మాకేరెల్, ట్యూనా వంటి చేపల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.

ప్రయోజనం: సుమారు 100 గ్రాముల సాల్మన్ చేప తింటే.. రోజువారీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి లో 60% నుంచి 100% వరకు అందుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు కూడా మేలు చేస్తాయి.

Advertisement

2. గుడ్డు సొన:
చాలా మంది కొలెస్ట్రాల్ భయంతో.. గుడ్డులోని పచ్చసొనను పక్కన పెడతారు. కానీ.. విటమిన్ డి కావాలంటే.. పచ్చసొన తినాల్సిందే.

ప్రయోజనం: విటమిన్ డి అనేది గుడ్డులోని తెల్ల సొనలో ఉండదు. కేవలం పచ్చసొనలోనే.. ఉంటుంది. ఒక గుడ్డు ద్వారా శరీరానికి సుమారు 5-10% విటమిన్ డి లభిస్తుంది. ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో.. పెరిగే కోడి గుడ్లలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

3. పుట్టగొడుగులు:
శాకాహారులకు విటమిన్ డి లభించే ఏకైక సహజ వనరు పుట్టగొడుగులు.
ప్రయోజనం: మనుషుల లాగే పుట్టగొడుగులు కూడా సూర్యరశ్మిని ఉపయోగించుకుని విటమిన్ డి ని తయారు చేస్తాయి. మార్కెట్లో దొరికే వాటి కంటే.. సూర్య రశ్మికి గురైన పుట్ట గొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటిని వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4. కాడ్ లివర్ ఆయిల్:
మీకు చేపలు తినడం ఇష్టం లేకపోతే.. కాడ్ లివర్ ఆయిల్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం.

ప్రయోజనం: ఇది ఒక సప్లిమెంట్ రూపంలో దొరుకుతుంది. ఒక్క టీస్పూన్ కాడ్ లివర్ ఆయిల్ ద్వారా రోజు వారీ అవసరానికి మించిన విటమిన్ డి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్-ఎ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

5. ఫోర్టిఫైడ్ ఫుడ్స్:
సహజంగా విటమిన్ డి దొరకని ఆహారాలకు కృత్రిమంగా విటమిన్ డి ని కలుపుతారు. వీటిని ‘ఫోర్టిఫైడ్ ఫుడ్స్’ అంటారు.

ప్రయోజనం:
ఆవు పాలు, సోయా పాలు, ఆరెంజ్ జ్యూస్, తృణ ధాన్యలు వంటి వాటిలో.. విటమిన్ డి ని ఫోర్టిఫై చేస్తారు. పాలు తాగే.. అలవాటు ఉన్న వారికి ఇది చాలా సులభమైన మార్గం. ముఖ్యంగా శాకాహారులు ఫోర్టిఫైడ్ సోయా మిల్క్ ద్వారా దీనిని పొందవచ్చు.

విటమిన్ డి లోపం వల్ల అలసట, కండరాల నొప్పులు, కుంగుబాటు వంటి సమస్యలు రావచ్చు. పైన పేర్కొన్న.. ఆహార పదార్థాలను మీ నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే.. కేవలం ఆహారంపైనే కాకుండా.. ఉదయం పూట కనీసం 15-20 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం ఉత్తమం.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×