E-Paper
Advertisement

Pizza: మిగిలిపోయిన చపాతీలతో ఇలా టేస్టీ పిజ్జా చేసేయండి, కొనడం ఎందుకు

Pizza: మిగిలిపోయిన చపాతీలతో ఇలా టేస్టీ పిజ్జా చేసేయండి, కొనడం ఎందుకు
Advertisement

ఇంట్లో రోటీలు, చపాతీలు వంటివి మిగిలిపోవడం సహజం. అలాంటప్పుడు టేస్టీగా పిజ్జా చేసేందుకు ప్రయత్నించండి. ఈ రెసిపీ చాలా సులువు. తక్కువ సమయంలో తయారయ్యే ఈ రోటీ పిజ్జా పిల్లలు పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఓవెన్ అవసరం లేకుండా పాన్ పైనే సులభంగా చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.

పిజ్జా రెసిపీకి కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన రోటీలు లేదా చపాతీలు – రెండు లేదా మూడు
పిజ్జా సాస్ – రెండు స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి
టమోటా – ఒకటి
క్యాప్సికమ్ – సగం ముక్క
స్వీట్ కార్న్ – రెండు స్పూన్లు
మోజారెల్లా చీజ్ – తగినంత
ఒరేగానో – ఒక స్పూను
చిల్లీ ఫ్లేక్స్ – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
బటర్ లేదా ఆలివ్ ఆయిల్ – అర స్పూను

Advertisement

Also Read: Egg Kebabs: కోడిగుడ్లతో ఎగ్ కబాబ్స్ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో

పిజ్జా రెసిపీ
1. ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్ ముందుగానే సన్నగా తరిగి పెట్టాలి.
2. స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి. చీజ్ తురిమి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టాలి. కొద్దిగా వెన్న లేదా ఆలివ్ ఆయిల్ వేయాలి.
4. ఇప్పుడు చపాతీలను పాన్ మీద పెట్టాలి. చపాతీలు కింద భాగం క్రిస్పీగా అయ్యేవరకు కాల్చుకోవాలి.
5. పైభాగంలో పిజ్జా సాస్ సమానంగా రాయాలి. సాస్ మీద ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా చల్లాలి.
6. చివరగా స్వీట్ కార్న్ చల్లితే పిజ్జాకు మంచి రుచి వస్తుంది.
7. ఇప్పుడు ఈ టాపింగ్స్ మీద అవసరమైనంత ఉప్పు చల్లాలి. అలగే ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లాలి.
8. తర్వాత తురిమిన మోజారెల్లా చీజ్‌ను మొత్తం టాపింగ్స్ మీద కప్పేలా వేయాలి. చీజ్ ఎక్కువగా వేసుకుంటే పిజ్జా మరింత రుచిగా ఉంటుంది.
9. ఇప్పుడు కళాయి మీద మూత పెట్టాలి. మంటను చాలా తక్కువగా పెట్టాలి. చిన్న మంటలో నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాలి.
10. చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆపాలి. రోటీ పిజ్జాను బయటకు తీసి కత్తితో ముక్కలుగా కట్ చేయాలి. వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచి మరింత బాగుంటుంది.

Advertisement

చపాతీలు మిగిలిపోయినప్పుడు ఇలా పిజ్జా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×