E-Paper
Advertisement

Smartphone Voice Control: ఇక టచ్ చేయాల్సిన అవసరం లేదు.. వాయిస్‌తో స్మార్ట్‌ఫోన్ కంట్రోల్

Smartphone Voice Control: ఇక టచ్ చేయాల్సిన అవసరం లేదు.. వాయిస్‌తో స్మార్ట్‌ఫోన్ కంట్రోల్

Smartphone Voice Control| స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు రోజువారీ జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయాయి. ఫోన్ తో కేవలం కాల్స్, మెసేజెస్ చేయడమే కాదు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కూడా వినియోగిస్తారు. అయితే ఇవ్వన్నీ యూజ్ చేయడానికి ఫోన్ టచ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వల్ల చాలా సమయం పడుతుందని చాలాసార్లు సోషల్ మీడియాలో డిబేట్లు కూడా జరిగాయి. అయితే ఈ పనులన్నీ టచ్ చేయకుండా తక్కువ శ్రమతో కేవలం వాయిస్ కమాండ్ తో చేయవచ్చు.

దీని కోసం కొత్త ఫోన్లలో వాయిస్ కంట్రోల్ ఫీచర్లున్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. ఈ ఫీచర్లతో స్క్రీన్ టచ్ చేయకుండానే ఫోన్‌ను కంట్రోల్ చేయవచ్చు. కాల్స్ చేయడం, మెసేజెస్ పంపడం, యాప్స్ ఓపెన్ చేయడం వాయిస్ కమాండ్స్‌తో ఫోన్ కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది.

సెట్టింగ్స్ కూడా వాయిస్‌తోనే మార్చవచ్చు. ఇది సమయం, శ్రమ ఆదా చేసే ఫీచర్లు. మల్టీటాస్కింగ్ సమయంలో ఈ ఫీచర్లు భలేగా ఉపయోగపడతాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వంట చేసే సమయంలో సహాయపడుతుంది. అంతే కాదు శారీరక అవరోధాలు (చేతులు లేనివారికి) ఉన్నవారికి కూడా ఉపయోగకరం.

వాయిస్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది?

వాయిస్ కంట్రోల్ ఉపయోగించి చేసే మీరు ఫోన్ కు ఇచ్చే (ఆదేశాలు) కమాండ్స్‌ను ఫోన్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మైక్రోఫోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి పనిచేస్తాయి. ఫోన్ మీ వాయిస్‌ను జాగ్రత్తగా వింటుంది. కమాండ్ బట్టి యాక్షన్ తీసుకుంటుంది. ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో ఇది ఇప్పటికే ఉంటుంది. సెట్టింగ్స్‌లో ఆన్ చేస్తే చాలు.

ఆండ్రాయిడ్ ఫోన్లను వాయిస్ కమాండ్స్‌తో ఎలా ఉపయోగించాలి?

ఆండ్రాయిడ్ ఫోన్లలో బలమైన వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో గూగుల్ అసిస్టెంట్ అత్యంత పాపులర్.

గూగుల్ అసిస్టెంట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?

సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అసిస్టెంట్, వాయిస్ మ్యాచ్‌పై ట్యాప్ చేయండి. “Hey Google” లేదా “OK Google.” ఆన్ చేయండి.

గూగుల్ అసిస్టెంట్‌తో ఇలా మాట్లాడండి

ఫోన్ చేయమని, యాప్, సెట్టింగ్స్ ఓపెన్ చేయమని, అలారం సెట్ చేయమని .. ఇలాంటి ఆదేశాలు వాయిస్ కంట్రోల్ ద్వారా ఫోన్ కు ఇవ్వొచ్చు. ఉదాహరణకు మీ అమ్మకు కాల్ చేయమని చెప్పడానికి “Call Mom” అని చెప్పండి,
వాట్సాప్ మెసేజ్ పంపడానికి “Send a WhatsApp message” అని ఆదేశించండి.
యూట్యూబ్ ఓపెన్ చేయడానికి “Open YouTube” అని చెప్పండి.
వైఫై ఆన్ చేయడానికి “Turn on Wi-Fi.” అని కమాండ్ ఇవ్వండి.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో టైప్ సి కేవలం ఛార్జింగ్ కోసం కాదు.. ఫోన్‌ని పవర్‌బ్యాంక్, పిసీగా మార్చే ట్రిక్స్

వాయిస్ యాక్సెస్‌తో పూర్తి హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్

స్క్రీన్‌ను పూర్తిగా వాయిస్‌తో నావిగేట్ చేయడానికి వాయిస్ యాక్సెస్ సహాయపడుతుంది.

వాయిస్ యాక్సెస్‌ను ఎలా ఆన్ చేయాలి?

సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఎంచుకోండి. వాయిస్ యాక్సెస్ సెలెక్ట్ చేసి ఆన్ చేయండి.

వాయిస్ యాక్సెస్‌తో ఏమేమి చేయవచ్చు

“Scroll down”, “Tap five”, “Go back”, “Open notifications” అని చెప్పవచ్చు. దివ్యాంగులైన యూజర్లకు ఎక్కువ సహాయపడుతుంది. సాధారణ యూజర్లకు కూడా ఉపయోగకరం.

ఐఫోన్‌ను వాయిస్ కమాండ్స్‌తో ఎలా కంట్రోల్ చేయాలి?

ఆపిల్ ఐఫోన్లలో కూడా అడ్వాన్స్‌డ్ వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. సిరి ఏఐ లేదా వాయిస్ కంట్రోల్ ఉపయోగించవచ్చు.

సిరి ఏఐ ఎలా యాక్టివేట్ చేయాలి?

సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిరి అండ్ సెర్చ్ ఎంచుకోండి. ‘Listen for Hey Siri”ని ఆన్ చేయండి.

సిరితో ఇలా వాయిస్ కంట్రోల్ చేయండి

కాల్స్ చేయడం, మెసేజెస్ పంపడం, రిమైండర్స్ సెట్ చేయడం, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్ డైరెక్షన్స్, స్మార్ట్ హోమ్ డివైస్‌లు కంట్రోల్ చేయవచ్చు.
iOS వాయిస్ కంట్రోల్‌తో కూడా పూర్తి నావిగేషన్ లభిస్తుంది. వాయిస్ కంట్రోల్ పూర్తి హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది.

iOS వాయిస్ కంట్రోల్‌ను ఎలా ఆన్ చేయాలి?

సెట్టింగ్స్‌లో యాక్సెసిబిలిటీలోకి వెళ్లి వాయిస్ కంట్రోల్ ఆన్ చేయండి.

ఉపయోగకరమైన వాయిస్ కమాండ్స్ ఏమిటి?

“Swipe left”, “Tap Messages”, “Open Camera”, “Go Home” అని చెప్పవచ్చు.

వాయిస్ కంట్రోల్ నిశ్శబ్దంగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో బెస్ట్‌గా పనిచేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ యాక్యురసీ తగ్గిస్తుంది. కొన్ని కమాండ్స్‌కు ఇంటర్నెట్ అవసరం. ప్రాక్టీస్ చేస్తే వాయిస్ రికగ్నిషన్ మెరుగవుతుంది. స్పష్టమైన ఉచ్చారణ వల్ల ఫోన్ కమాండ్స్ బాగా అర్థం చేసుకుంటుంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×