E-Paper
Advertisement

Honda Activa 7G: వచ్చేస్తోంది హోండా యాక్టివా 7G, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?

Honda Activa 7G: వచ్చేస్తోంది హోండా యాక్టివా 7G, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
Advertisement

Honda Activa 7G 2026: హోండా యాక్టివా 7G గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇండియాలో మోస్ట్ సేల్స్ కలిగిన స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. యాక్టివా ఇప్పుడు సరికొత్తగా అందుబాటులోకి రాబోతోంది. హోండా యాక్టివా 7G పేరుతో మార్కెట్లోకి రాబోతోంది. ఈ నెలలోనే కొత్త వెర్షన్ లాంచ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి అధికారిక లాంచ్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోయినా, పలు ఆటోమొబైల్ వెబ్‌సైట్లు వార్తలు రాస్తున్నాయి. జనవరి 2026లో భారత మార్కెట్‌లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నాయి. ఈ స్కూటర్ యాక్టివా 6Gకి సక్సెసర్‌గా రాబోతోంది. మైనర్ అప్‌డేట్స్‌ తో రిఫ్రెష్ వెర్షన్‌గా ఉండబోతోంది.

హోండా యాక్టివా 7G అంచనా ధర  

హోండా యాక్టివా 7G ఎక్స్ షోరూమ్ ధర రూ. 79,000 నుంచి రూ. 90,000 వరకు ఉంటుందని భావిస్తున్నారు. వేరియంట్, సిటీ బట్టి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్ రోడ్ ధర స్థానిక టాక్సులు, ఇన్సూరెన్స్ ను బట్టి ఎక్కువగా ఉంటుంది.

హోండా యాక్టివా 7G ఇంజిన్, పెర్ఫార్మెన్స్  

Advertisement

హోండా యాక్టివా 7G 109cc లేదంటే 110cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, BS6 ఇంజిన్ తో రాబోతోంది. సుమారు 7.7-7.8 PS పవర్ ఉంటుంది. టార్క్ 8.8-8.9 Nmగా ఉండబోతోంది. ట్రాన్స్‌ మిషన్ ఆటోమాటిక్ గా రాబోతోంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ కు 55-60కిలో మీటర్లు ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్  5 లీటర్లుగా ఉండబోతోంది.

హోండా యాక్టివా 7G కీ ఫీచర్లు

కొత్త 7G బ్యాడ్జింగ్, అప్‌డేటెడ్ బాడీ ప్యానెల్స్, LED హెడ్‌ల్యాంప్ తో వస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ డిజిటల్, డిజిటల్ కన్సోల్ తో మోడర్న్ లుక్ లో ఉంటుంది. సైలెంట్ స్టార్టర్, ఐడ్లింగ్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్, కంబైండ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎక్స్‌ టర్నల్ ఫ్యూయల్ ఫిల్, సీట్ ఓపెనర్ స్విచ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది.

Advertisement

Read Also: ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హోండా యాక్టివా 7G కలర్స్, వేరియంట్స్

హోండా యాక్టివా 7G  బ్లాక్, వైట్, బ్లూ, రెడ్, మెటాలిక్ షేడ్స్, డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా ఉండవచ్చు. వేరియంట్ల విషయానికి వస్తే స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

హోండా యాక్టివా 7G వేటితో పోటీ పడుతుందంటే..  

హోండా యాక్టివా 7G.. TVS Jupiter, Suzuki Access 125, Hero Destini 125 లాంటి వంటి స్కూటర్లతో పోటీ పడుతుంది.  అధికారిక లాంచ్ అయిన తర్వాత కచ్చితమైన స్పెసిఫికేషన్స్, ధరలకు సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి.

Read Also: ఒక్క ఛార్జ్ తో 150 కి.మీ రేంజ్, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదుర్స్ అంతే!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×