E-Paper
Advertisement

Mulberry Benefits: రక్తహీనత నుంచి డయాబెటిస్ వరకు.. అన్నింటికీ ముల్బెర్రీ ఒకటే పరిష్కారం!

Mulberry Benefits: రక్తహీనత నుంచి డయాబెటిస్ వరకు.. అన్నింటికీ ముల్బెర్రీ ఒకటే పరిష్కారం!
Advertisement

Mulberry Benefits: మనలో చాలామంది చిన్నప్పుడు చెట్ల పొదల వెంట తిరుగుతూ నలుపు, ఎరుపు రంగు ముల్బెర్రీ పండ్లను కోసుకుని తినే ఉంటాము. ఆ పండ్ల మాదిరే చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా ఎంత మధురమైనవి కదా. ఎందుకంటే.. పులుపు, తీపి కలగలిసిన ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేము. అయితే, ఈ పండ్లు కేవలం టేస్టీగానే కాదు.. ఆరోగ్యానికీ సంజీవని లాంటిది. పోషకాల గనిగా పిలిచే ఈ చిన్న పండ్లలో ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు దాగున్నాయి. మరి ముల్బెర్రీ పండ్లు తినడం వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.

బరువు నియంత్రణలో:

ఇందులో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.

రక్తహీనత తగ్గిస్తుంది:

Advertisement

ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.

Also Read: నీరసం, అలసట మాయం.. శరీరంలో రక్తాన్ని పెంచే నేచురల్ డ్రింక్స్!

డయాబెటిస్‌కు చెక్:

Advertisement

రక్తంలో చక్కెర స్థాయిని సంతులితం చేయడంలో ముల్బెర్రీ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

రోగనిరోధక శక్తి పెంపు:

ముల్బెర్రీ పండ్లలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగ మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

మెదడు చురుగ్గా ఉంటుంది:

ముల్బెర్రీ పండ్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

గుండెకు మంచిది:

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతూ, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కాంతివంతమైన చర్మం:

యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల ముడతలు తగ్గి చర్మం ఎప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

అలసట దరిచేరదు:

ముల్బెర్రీ పండ్లలో సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల శరీరంలో వచ్చే వాపులను, నీరసాన్ని తగ్గిస్తుంది.

మెరుగైన కంటి చూపు:

ఈ పండ్లలోని విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచి, చూపును మెరుగుపరుస్తాయి.

Also Read: మందారం పువ్వులను పూజకే కాదు.. ఇలా వాడితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు!

Tags

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×