E-Paper
Advertisement

Iron Deficiency: నీరసం, అలసట మాయం.. శరీరంలో రక్తాన్ని పెంచే నేచురల్ డ్రింక్స్!

Iron Deficiency: నీరసం, అలసట మాయం.. శరీరంలో రక్తాన్ని పెంచే నేచురల్ డ్రింక్స్!
Advertisement

Iron Deficiency: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య రక్తహీనత. శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గితే హిమోగ్లోబిన్ ఉత్పత్తి దెబ్బతింటుంది. దీంతో త్వరగా అలసిపోవడం, నీరసించి పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు కేవలం టాబ్లెట్ల మీదే ఆధారపడకుండా.. ఇంట్లోనే ఐరన్, విటమిన్ సి పుష్కలంగా దొరికే జ్యూస్‌లను తయారు చేసుకుని తాగడం ఉత్తమం. దీంతో రక్తహీనత సమస్యను సహజంగానే అధిగమించవచ్చు.

శరీరానికి కేవలం ఐరన్ ఉన్న ఆహారం అందిస్తే సరిపోదు. దాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్ సి కచ్చితంగా తోడుండాలి. అందుకే నారింజ, పైనాపిల్ వంటి పండ్లను జ్యూస్‌గా చేసుకుని తాగితే మంచి ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల్లో ఐరన్ అందించే పాలకూర, దోసకాయ, కాలే ఆకులతో చేసే గ్రీన్ జ్యూస్ శరీరానికి కావలసిన ఖనిజాలను అందించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Advertisement

Also Read: 73 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్.. కుర్రాళ్లను కళ్లు తిప్పుకోకుండా చేస్తున్న వృద్ధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

చాలామంది బీట్‌రూట్ తినడానికి ఇష్టపడరు. కానీ బీట్‌రూట్‌లో కొంచెం మిరియాల పొడి, ఉప్పు, బెర్రీలు కలిపి షూటర్స్ మాదిరి తయారు చేసుకుని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది రక్తహీనతను తగ్గించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పిల్లలకు కూడా ఇదొక హెల్తీ డ్రింక్‌లా పని చేస్తుంది.

Advertisement

వేసవిలోనే కాదు శీతాకాలంలోనూ విరివిగా దొరికే పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని దానిమ్మ గింజలతో కలిపి జ్యూస్ చేసుకుని తాగితే, హిమోగ్లోబిన్ స్థాయిలు అద్భుతంగా పెరుగుతాయి. కొంచెం పుదీనా, నిమ్మరసం, తేనె కలిపితే ఇది ఒక రిఫ్రెషింగ్ డ్రింక్‌లా మారుతుంది. ఇది ఐరన్ లోపాన్ని నివారించడమే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

ఇకపోతే.. అరటిపండులో ఐరన్, స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఉంటాయి. ఈ రెండింటినీ పాలతో కలిపి స్మూతీలా చేసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వీటికి కొన్ని గుమ్మడి గింజలు లేదా తేనె కలిపితే పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఆహారాన్ని ఉడికించి తీసుకోవడం కంటే.. ఇలా నేచురల్ జ్యూస్‌ల రూపంలో తీసుకోవడం వల్ల ఐరన్ సమస్యను వేగంగా తగ్గించుకోవచ్చు.

Also Read: జీర్ణ సమస్యలకు చెక్ పెట్టి.. లివర్‌ని క్లీన్ చేసే కరివేపాకు.. పళ్లెం నుంచి తీసిపారేస్తే నష్టపోయేది మీరే!

 

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×