E-Paper
Advertisement

Hibiscus Water Benefits: మందారం పువ్వులను పూజకే కాదు.. ఇలా వాడితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు!

Hibiscus Water Benefits: మందారం పువ్వులను పూజకే కాదు.. ఇలా వాడితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు!
Advertisement

Hibiscus Water Benefits: మందారం పువ్వు అనగానే మనకు ముందుగా దేవుడి పూజలే గుర్తొస్తాయి. కానీ ఈ ఎర్రని పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కరోనా తర్వాత చాలామందికి ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ, చాలామంది హెర్బల్ టీలకు బదులుగా మందారం నీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నీటిని రోజూ తాగడం వల్ల మన శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్:

మందారం పువ్వుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్‌గా వచ్చే బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. ముఖ్యంగా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఈ నీరు కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో మందారం నీరు ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

Also Read: బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బొప్పాయితో కలిగే అద్భుత ప్రయోజనాలివే!

బరువు నియంత్రణ:

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యలు మధుమేహం, అధిక బరువు. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి మందారం నీరు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శరీర మెటబాలిజాన్ని వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి నేచురల్ డ్రింక్‌లా పనిచేస్తుంది.

మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు:

Advertisement

మందారం నీటితో కేవలం అంతర్గత ఆరోగ్యమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఈ నీరు చర్మాన్ని తాజాగా ఉంచితే, దీనితో తయారు చేసిన నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలంగా మారుస్తుంది. అయితే ఈ చిట్కాలను పాటించే ముందు ఒకసారి వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

Also Read: గుడ్డు తెల్లసొనను ఇలా వాడితే 40లోనూ యవ్వనమైన మెరుపు గ్యారెంటీ.. మీరూ ట్రై చేస్తారా మరి?

 

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×