E-Paper
Advertisement

Menthi Farming: వారం రోజుల్లో వచ్చే పంట.. ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ!

Menthi Farming: వారం రోజుల్లో వచ్చే పంట.. ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ!
Advertisement

Fenugreek Cultivation: రైతులకు వ్యవసాయం అనేది కత్తిమీద సాము లాంటిది. ప్రకృతి ఎప్పుడు ఎలా పగబడుతుందో చెప్పడం కష్టం. అతివృష్టి, అనావృష్టితో రైతులు కోలుకోలేని దెబ్బ తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్ లోనూ అలాంటి అవస్థలే పడ్డారు. మొంథా తుఫాన్ దెబ్బకు వరి పంట నేలకొరిగి అన్నదాతలు పెద్దమొత్తంలో నష్టపోయారు. పత్తి పంటలు చీడపీడలతో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు సాంప్రదాయ పంటల సాగును వదిలి, ఆకుకూరల సాగువైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేస్తున్నారు.

నష్టం లేని ఏకైక పంట మెంతిసాగు

మెంతికూర సాగుతో మంచి లాభాలు గడిస్తున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన అన్నదాతలు. కేవలం విత్తనాల ఖర్చు మినహా మరే పెట్టుబడి లేకపోవడం, చీడపీడల ముప్పు ఉండకపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా వారం రోజుల్లో పంట చేతికి రావడంతో అన్నదాతలు మెంతిసాగు వైపు మళ్లుతున్నారు. కనగల్లు మండలం చిన్నమాధారం గ్రామానికి చెందిన రైతులు మెంతిసాగుకు ఎక్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఊరు సాధారణంగానే అకుకూరలు, కూరగాయలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. నల్లగొండ మార్కెట్ కు వచ్చే ఆకుకూరల్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే వస్తాయి. పాలకూర, చుక్కకూర, కలగూర, బచ్చలికూర, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీరతో పాటు మెంతికూర ఎక్కువగా సాగవుతుంది. మిగతా పంటలకు చీడపీడల ముప్పు ఉన్నా, మెంతికూరకు అలాంటి సమస్య ఉండదు.

వారం రోజుల్లో పంట చేతికి..

Advertisement

మెంతికూర సాగు కూడా చాలా సులభంగా ఉంటుంది. ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. కిలో మెంతులు చల్లడానికి రెండు గజాల స్థలం ఉంటే సరిపోతుంది. ముందుగా నేలను మెత్తగా దున్నుకోవాలి. చిన్న చిన్న మడులు చేసుకోవాలి. మెంతులను తెచ్చుకోవాలి. కిలో మెంతుల ధర రూ. 100 ఉంటుంది. వాటిని మడిలో చల్లి, దాని మీద పలుచగా మట్టి కప్పాలి. నీళ్లు పెట్టాలి. రెండు రోజులకు ఓసారి నీళ్లు ఇవ్వాలి. వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు చల్లాల్సిన అవసరం లేదు. కిలో మెంతులకు సుమారు 300 మెంతికూర కట్టలు వస్తాయి. ఒక్కో కట్ట ధర రూ. 5 పలుకుతుంది. తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముతారు. దీని ధర కూడా పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే మెంతికూర సాగు చేసే రైతులు ఎప్పుడూ నష్టపోయిన సందర్భాలు లేవు.

తక్కువ శ్రమతో మంచి లాభం

“నేను గత 15 ఏళ్లుగా మెంతికూర సాగు చేస్తున్నాను. మిగతా ఆకు కూరలు సాగు చేస్తే శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పంట అయినా చేతికి రావడానికి సుమారు నెల రోజులు పడుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నా, చలి తీవ్రత పెరిగినా మిగతా కూరలు పెరగవు. మెంతికూరతో ఎలాంటి సమస్యలు రావు. తక్కువ శ్రమ, ఖర్చుతో మంచిలాభాలు పొందుతున్నాం. ఇంత వరకు ఏనాడు మెంతికూర సాగుతో నష్టం అనేది చూడలేదు.”

Advertisement

చిట్టిమల్ల రామలింగం, మెంతిసాగు రైతు

తక్కువ స్థలం ఉన్నా చాలు

“మిగతా ఆకు కూరల సాగు మాదిరిగా ఎక్కువ స్థలం అవసరం లేదు. ఒక గుంట భూమి ఉంటే చాలు. ఏడాదంతా మెంతికూర సాగు చెయ్యొచ్చు. పంటచేతికి రాగానే, దాని అడుగు భాగాన్ని మెత్తగా తవ్వాలి. వదిలేయాలి. పక్కన ఉన్న స్థలంలో మళ్లీ మెంతులు చల్లాలి. అలా గుంట జాగా మొత్తం పూర్తయ్యాక. మళ్లీ మొదటి నుంచి చల్లుకుంటూ రావాలి. కేవలం వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి నిత్యం ఆదాయం పొందవచ్చు. మెంతికూర సాగు అనేది అత్యంత సులభమైన, లాభసాటి పంట.”

చిట్టిమల్ల యాదయ్య, మెంతిసాగు రైతు

సాగు చేస్తామంటే సలహాలు ఇస్తాం!

ఎవరికైనా మెంతికూర సాగు చేయాలనే ఆలోచన ఉంటే తాము సలహాలు ఇస్తామంటున్నారు రైతులు రామలింగం, యాదయ్య.  వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండే యువతీ, యువకులు తక్కువ కష్టంతో మంచి లాభాలు పొందవచ్చు అంటున్నారు. వ్యవసాయం చేసేందుకు స్థలం లేకపోయినా, ఇంటి మీద కూడా సాగు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీకూ మెంతికూర సాగు చేయాలనే కోరిక ఉంటే, వెంటనే మొదలెట్టేయండి!

మెంతికూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

ఎలాంటి ఎరువులు, పురుగుమందులు వాడని మెంతికూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్, విటమిన్ A, C, ఫోలేట్, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా రక్తహీనత, డయాబెటిస్, జుట్టు రాలడం, మలబద్దకం, గుండె సమస్యలు, పీరియడ్స్ నొప్పులు, కీళ్ల నొప్పులను కంట్రోల్ చేస్తాయి. తల్లిలో పాల ఉత్పత్తి, రోగ నిరోధకశక్తి పెరుగుదలకు సాయపడుతాయి.

Read Also: ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!

Related News

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

Big Stories

Advertisement
×