Raj Tarun Comments: ఒకప్పుడు సినిమా రంగంలో ప్రవేశించి మంచి పేరు తెచ్చుకోవడం అనేది మామూలైన విషయం కాదు. చాలాచోట్ల ఆడిషన్ ఇవ్వడానికి కూడా అవకాశం దొరికేదికాదు. సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత చాలామంది టాలెంట్ ప్రదర్శించడానికి సోషల్ మీడియా అనేది ఒక వేదిక అయింది. అయితే సోషల్ మీడియా వలన నెగిటివ్ మరియు పాజిటివ్ రెండు ఉన్నాయి. అయితే మనం సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకున్నాం అనే దాని మీద అంత డిపెండ్ అయి ఉంటుంది. షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అలానే ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ చేసి ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. రాజ్ కి కూడా వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఫెయిల్యూర్ సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వివాదాలు చిక్కుకోవడంలో కూడా అతనికి మైనస్ గా మారింది. కెరియర్ లో వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినప్పుడు అవకాశాలు కూడా విపరీతంగా వస్తుంటాయి. అయితే వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు అనే ఉద్దేశంతో చాలామంది ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తూ ఉంటారు. ఆ టైం కి ఆ సినిమాల వలన డబ్బులు వస్తాయి కానీ ఆ యాక్టర్ మీద ఉన్న నమ్మకం పోతుంది అని గ్రహించలేరు.
రాజ్ తరుణ్ జీవితంలో ఇదే జరిగింది. ఆల్మోస్ట్ రాజ్ తరుణ్ సినిమాలకు జనాలు ఆసక్తి చూపించడం మానేశారు. ఈ ప్రాసెస్ లో ఒక గొప్ప సినిమా వచ్చినా కూడా దానిమీద చాలామందికి ఆసక్తి ఉండడం లేదు. రీసెంట్ గా రాజ్ తరుణ్ పాంచ్ మినార్ అనే సినిమా చేశాడు. నవంబర్ 21వ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైంది. మరోవైపు అదే రోజున రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా కూడా విడుదలైంది. ఎక్కువ శాతం ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, పాంచ్ మినార్ సినిమాకి ఊహించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. ఇక చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ సినిమాను చూడండి. ఈ సినిమాలో మీకు ఎక్కడైనా నవ్వు రాకపోతే, అలానే సినిమా నచ్చకపోతే నా ఇంస్టాగ్రామ్ ఐడి కి మెసేజ్ చేయండి.
Also Read: HBD Anil Ravipudi: డైరెక్టర్ కాదు డాక్టర్, అందుకే మరో రాజమౌళి అయ్యాడు
నేను ఆ డబ్బులు మీకు రిటర్న్ చేస్తాను అని దర్శకుడు మాట్లాడారు. అలానే రాజ్ తరుణ్ కూడా మాట్లాడుతూ నాది హామీ డబ్బులు రిటన్ చేస్తాము అంటూ చెప్పాడు. అయితే వాళ్లు తీసుకున్న నిర్ణయం మరియు స్టేట్మెంట్ మంచిదే కావచ్చు. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా జాతకం మార్నింగ్ షో టాక్ తో దాదాపు ఖరారు అయిపోతుంది. ఎన్ని సినిమాలు ఒకే డేటున విడుదలైనా కూడా, ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అందరూ దానికే బ్రహ్మరథం పడతారు. అయితే ఇప్పుడు పాంచ్ మినార్ సినిమా టాక్ విషయంలో ఏమాత్రం అయినా మార్పు వస్తుందేమో చూడాలి. వాస్తవానికి పెద్దగా ఎక్కడ ఆ సినిమా గురించి వినిపించడం లేదు.