E-Paper
Advertisement

Wedding Guests: వెడ్డింగ్ గెస్ట్ లిస్ట్, మోహమాటం కొద్దీ వీరిని పిలిచి ఇబ్బందుల్లో పడకండి !

Wedding Guests: వెడ్డింగ్ గెస్ట్ లిస్ట్, మోహమాటం కొద్దీ వీరిని పిలిచి ఇబ్బందుల్లో పడకండి !
Advertisement

Wedding Guests: పెళ్లి అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం. ఈ వేడుక ప్రశాంతంగా.. ఆనందంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. మనకు తెలిసిన వారందరినీ పెళ్లికి పిలవడం వల్ల ఒక్కోసారి అనవసరమైన గొడవలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ పెళ్లి రోజును చిరాకు పెట్టే అవకాశం ఉన్న కొందరు వ్యక్తులను ఆహ్వానించకపోవడమే మంచిది. మీ వివాహ వేడుకకు పిలవకూడని 5 రకాల అతిథుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1. మాజీ లవర్స్:
మీరు మీ ఎక్స్ (Ex) తో ఇప్పటికీ మంచి స్నేహంతో ఉన్నా మని అనుకున్నప్పటికీ.. వారిని పెళ్లికి పిలవడం వల్ల కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో అనవసరమైన ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు. మీ జీవిత భాగస్వామికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు. పాత జ్ఞాపకాలు పక్కన పెట్టి.. కొత్త ప్రయాణాన్ని ప్రశాంతంగా మొదలుపెట్టడం ఉత్తమం.

Advertisement

2.ఎప్పుడూ విమర్శించే వారు:
మన చుట్టూ కొందరు వ్యక్తులు ఉంటారు. వారు దేనిలోనూ మంచిని చూడలేరు. వంటల దగ్గర నుంచి డెకరేషన్ వరకు ప్రతి విషయంలోనూ లోపాలు వెతుకుతూ.. నెగటివ్ కామెంట్స్ చేసే వారిని దూరంగా ఉంచడం మంచిది. మీ సంతోష కరమైన రోజున ఇలాంటి వారి మాటలు మీ మూడ్‌ని పాడుచేసే అవకాశం ఉంది.

3. గొడవలు సృష్టించేవారు లేదా తాగే అలవాటు ఉన్నవారు:
కొంత మంది మద్యం తాగిన తర్వాత విచక్షణ కోల్పోయి గొడవలు చేస్తుంటారు లేదా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. పెళ్లి వంటి పవిత్ర మైన వేడుకలో ఇలాంటి సంఘటనలు జరిగితే కుటుంబం మర్యాద దెబ్బతింటుంది. అదుపులో ఉండ లేని ప్రవర్తన కలిగిన వారిని ఆహ్వానించక పోవడమే మీ పెళ్లి భద్రతకు , ప్రశాంతతకు మంచిది.

Advertisement

4. ఎప్పుడో మాట్లాడటం మానేసిన పాత స్నేహితులు:
స్కూల్ లేదా కాలేజీలో ఎప్పుడో స్నేహితులుగా ఉండి, గత ఐదారు ఏళ్లుగా అస్సలు టచ్‌లో లేని వారిని కేవలం సంఖ్య పెంచడం కోసం పిలవాల్సిన అవసరం లేదు. పెళ్లి అనేది మీకు అత్యంత సన్నిహితుల మధ్య జరగాల్సిన వేడుక. కేవలం మొహమాటం కోసం పిలిచి.. ఖర్చును పెంచుకోవడం కంటే మీకు ఇష్టమైన వారితో గడపడం ఉత్తమం.

Also Read: ఒంటరి పోరాటం.. విడాకులు తీసుకున్న వారు మాత్రమే గ్రహించే 30 అంశాలు

5. పనిలో సమస్యలు సృష్టించే సహోద్యోగులు:
ఆఫీసులో మీతో పోటీ పడేవారు లేదా మీపై అసూయ పడే సహోద్యోగులను పిలవడం వల్ల పెళ్లిలో కూడా పనికి సంబంధించిన చర్చలు లేదా అసౌకర్యమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీకు ఆఫీసు బయట కూడా మంచి స్నేహితులుగా ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించండి.

పెళ్లి మీది.. కాబట్టి అతిథుల లిస్ట్‌ను నిర్ణయించే హక్కు మీకే ఉంది. ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవ కూడదు అనే విషయంలో మొహ మాటాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి. మీ చుట్టూ మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు.. మీ సంతోషాన్ని కోరుకునే వారు మాత్రమే ఉంటే ఆ వేడుక మరింత గుర్తుండి పోతుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×