E-Paper
Advertisement

Avatar Fire and Ash Movie Review : అవతార్ 3 రివ్యూ : ఫైర్ లేదు యాష్ మాత్రమే

Avatar Fire and Ash Movie Review : అవతార్ 3 రివ్యూ : ఫైర్ లేదు యాష్ మాత్రమే
Advertisement

Avatar Fire and Ash Movie Review :16 ఏళ్ల క్రితం 2009లో జేమ్స్ కామెరాన్ ఓ విజువల్ వండర్‌ని క్రియేట్ చేశారు. ప్రపంచం మొత్తం దానికి ఫిదా అయిపోయింది. అదే అవతార్. ఆ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి సీక్వెల్‌గా 2022లో అవతార్ 2 అంటూ ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ కూడా వచ్చింది.’అవతార్’ రేంజ్లో ఇది ఇంప్రెస్ చేయకపోయినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం దానికి మంచి వసూళ్ళు వచ్చాయి. ఇప్పుడు ‘అవతార్ 3 ‘… ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించారా? లేదా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…

కథ :

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్‌’ లో జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) తన కుటుంబ సభ్యులను నేవి తెగ వారి నుండి ఎలా కాపాడుకున్నాడు. ఈ క్రమంలో కొడుకుని ఎలా కోల్పోయాడు అనేది చూపించాడు. ఆ తర్వాత అతని కుటుంబం ఎలా కృంగిపోయింది. నేవి తెగ వారిపై పగ తీర్చుకునే క్రమంలో జేక్ సల్లీ కి మాంగ్‌క్వాన్ అనే అగ్ని తెగ వారి నుండి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? వాటిని తట్టుకుని ఎలా నిలబడగలిగారు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.?

విశ్లేషణ :

Advertisement

‘అవతార్’ మేజిక్ ని ‘ది వే ఆఫ్ వాటర్’ రిపీట్ చేయలేదు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. అందువల్ల జేమ్స్ కామరూన్ ‘అవతార్ 3’ తో అయినా జాగ్రత్తపడతాడులే అని అంతా అనుకున్నారు. కానీ ‘అవతార్ 3’ కథ, కథనాలు అందరినీ షాక్ కి గురిచేసే విధంగానే ఉన్నాయి అని చెప్పాలి. పొంతన లేని కథ, ఎమోషన్ వంటివి ఆడియన్స్ ని ఇరిటేట్ చేశాయి. విజువల్స్ పరంగా ఓకే అనిపించినా… ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వనప్పుడు.. పాస్ మార్కులు ఎలా పడతాయి.

‘అవతార్ ఫైర్ అండ్ యాష్ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ కే ఆడియన్స్ బిత్తరపోయి చూస్తారు. ఇక సెకండాఫ్ అయితే ఫస్టాఫ్ బెటర్ అనిపించేలా చేస్తుంది. చాలా సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. వరల్డ్ సినిమాని ఆడియన్స్ వీక్షిస్తున్నప్పుడు.. రాజ్ కుమార్ హిరానీ, శంకర్ వంటి దర్శకులే వాళ్ళ ఐడియాలజీని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో జేమ్స్ కామరూన్ కూడా వచ్చి చేరారు అని చెప్పడంలో సందేహం లేదు.

Advertisement

థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వడం అంటే.. కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ తో సౌండ్ తో మెప్పించాలని అనుకోవడం కాదు. దాని కోసం నిర్మాతల డబ్బుని మంచి నీరులా ఖర్చు పెట్టించడం కూడా కాదు. హాలీవుడ్ దర్శకులు సైతం దీనిని గమనించాలి. అయితే కొత్తగా అవతార్ 3 ని చూసిన వాళ్లకి, అవతార్ 2 భాగాలూ చూసొచ్చినా వాళ్లకి ఒక్కటే ఫీలింగ్ వస్తుంది అంటే అది దర్శకత్వం లోపం అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
వీ ఎఫ్ ఎక్స్
సౌండ్ డిజైన్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
ఎమోషన్ మిస్ అవ్వడం
రిపీటెడ్ సన్నివేశాలు

మొత్తంగా ‘అవతార్ 3’ ఆడియన్స్ లో ఫైర్ నింపే అవకాశం లేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మైండ్ యాష్ కాకుండా ఉంటుంది

Avatar Fire and Ash Rating : 2.5/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×