E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఫోన్ల‌లో ఇక వాట్సప్ పనిచేయదు, డేటాను ఇలా సేవ్ చేసుకోండి!

ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఫోన్ల‌లో ఇక వాట్సప్ పనిచేయదు, డేటాను ఇలా సేవ్ చేసుకోండి!
Advertisement

WhatsApp New Update: నేటి టెక్ యుగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలామంది వాట్సప్‌లోనే గంటల తరబడి సమయం గడుపుతుంటారు. అంతలా అడిక్ట్ అయిపోయారు జనాలంతా ఈ యాప్‌కి. అలాంటి వాట్సప్ గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి ఇకపై వాట్సప్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 5.0, 5.1 వెర్షన్లపై నడిచే ఫోన్లలో 2026 సెప్టెంబర్ నుంచి వాట్సప్ ఆగిపోనుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత సాఫ్ట్‌వేర్‌లను పక్కన పెట్టక తప్పదని కంపెనీ చెబుతోంది.

కొత్త ఫీచర్లు కావాలంటే..

వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూ మనకు చాటింగ్‌ను మరింత ఈజీ చేస్తోంది. ఉదాహరణకు నోటిఫికేషన్ బబుల్స్ అనే ఫీచర్. మనం వేరే ఏదైనా పనిలో ఉన్నప్పుడు వాట్సాప్ మెసేజ్ వస్తే.. స్క్రీన్ మీద చిన్న బబుల్‌లా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వెంటనే రిప్లై ఇచ్చేయొచ్చు. ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో సరిగ్గా సపోర్ట్ చేయవు. అందుకే కనీసం ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ ఉంటేనే వాట్సప్ సాఫీగా రన్ అవుతుంది.

Advertisement

Also Read: వావ్.. లాంచ్ అయిన కొద్దిరోజులకే Samsung Galaxy A37పై ఊహించని డిస్కౌంట్!

ముందు జాగ్రత్త అన్నమాట..

ఒక్కసారిగా వాట్సప్ బంద్ అయిపోతే ఇబ్బంది పడతారని కంపెనీ ముందే అలర్ట్ చేస్తోంది. పాత ఫోన్లు వాడుతున్న వారికి ఇప్పటికే వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. సెప్టెంబర్ లోపు మీ ఫోన్ మార్చుకోవాలని లేదంటే డేటా భద్రపరుచుకోవాలని సూచిస్తోంది. మీ పాత చాట్స్, ఫొటోలు పోకుండా ఉండాలంటే వెంటనే గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీరు కొత్త ఫోన్ కొన్నా కూడా మీ పాత మెసేజ్‌లన్నీ అందులోకి వచ్చేస్తాయి.

ఎవరిపై ఎక్కువ ప్రభావం?

Advertisement

మన దేశంలో ఇప్పటికీ చాలామంది పాత ఫోన్లను వాడుతుంటారు. బడ్జెట్ ఫోన్లు వాడే వారికి, ముఖ్యంగా గత ఐదారు ఏళ్లుగా ఫోన్ మార్చని వారికి ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఆండ్రాయిడ్ 5.0 వంటి పాత వెర్షన్లలో భద్రత కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్ యూజర్లకు మాత్రం ప్రస్తుతానికి టెన్షన్ లేదు. ఐఓఎస్ 15.1 కంటే పైన ఉన్న వెర్షన్లన్నింటిలో వాట్సప్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. దీంతో మీ ఫోన్ వెర్షన్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.

Also Read: iPhone 17 Proపై భారీ డిస్కౌంట్.. ఈ ధరకు మరెక్కడా దొరకదు, ఆఫర్ ఎలా పొందాలంటే?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×