E-Paper
Advertisement

Suicide Risk: ఆత్మహత్యలు జరిగేవి.. డిప్రెషన్ వల్ల కాదట, అసలు కారణాలు ఇవేనట!

Suicide Risk: ఆత్మహత్యలు జరిగేవి.. డిప్రెషన్ వల్ల కాదట, అసలు కారణాలు ఇవేనట!
Advertisement

Suicide Risk: సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే.. వారు డిప్రెషన్‌లో ఉండి ఉంటారని లేదా మానసిక సమస్యలతో ఇబ్బంది పడ్డారేమో అని అనుకుంటాం. “అయ్యో.. వాళ్లు చాలా సరదాగా ఉండేవారు, ఎందుకు ఇలా చేశారో తెలియడం లేదు” అని స్నేహితులు, బంధువులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అయితే.. ఆత్మహత్య చేసుకునే వారిలో దాదాపు సగం మందికి ఎలాంటి మానసిక అనారోగ్య లక్షణాలు ఉండవని.. అసలు వారు అంతకు ముందు ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలను కూడా బయటపెట్టలేదని తాజా పరిశోధనల్లో రుజువైంది.

Advertisement

ఉటా యూనివర్సిటీ నిర్వహించిన ఒక జెనెటిక్ అధ్యయనం ప్రకారం.. ఆత్మహత్య చేసుకునే వారిలో కొంత మంది రిస్క్ ఫ్యాక్టర్స్ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ అధ్యయనం JAMA Network Open అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే.. ఆత్మహత్య చేసుకున్న వారు డిప్రెషన్‌లో ఉన్నారని.. వారు ఆ విషయాన్ని దాచి ఉంచడం వల్ల మనకు తెలియలేదని భావించేవాళ్లం. కానీ.. ప్రొఫెసర్ హిల్లరీ కూన్ నేతృత్వంలోని ఈ పరిశోధన బృందం 2,700 కంటే ఎక్కువ మందికి సంబంధించిన డేటాను విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అధ్యయనంలో తేలిందేంటంటే.. ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకునే వారిలో జన్యుపరంగా కూడా డిప్రెషన్ లేదా యాంగ్జైటీ వంటి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇది డిప్రెషన్ కాకపోవచ్చు!

Advertisement

హిల్లరీ కూన్ మాటల్లో చెప్పాలంటే.. “చాలా మంది ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉన్నవారిలో డిప్రెషన్ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నిజానికి వారికి డిప్రెషన్ ఉండకపోవచ్చు. అంటే, ఆత్మహత్యకు డిప్రెషన్ ఒక్కటే కారణం కాదు. ఈ పరిశోధన ఆత్మహత్య నివారణ పద్ధతులను మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉందని సూచిస్తోంది. కేవలం మానసిక అనారోగ్యం కోసం స్క్రీనింగ్ (పరీక్షలు) చేస్తే సరిపోదు. ఎందుకంటే.. ఈ రెండో రకానికి చెందిన వరిలో మల్టీపుల్ డిజార్డర్స్, అల్జీమర్స్, PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) వంటి వాటికి సంబంధించిన జన్యు పరమైన సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయి. అందుకే వీరు సాధారణ వ్యక్తుల్లాగానే కనిపిస్తారు.

ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏంటి ?

మానసిక సమస్యలు లేకపోయినా ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే శారీరక సమస్యలు కూడా ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.

దీర్ఘకాలిక నొప్పులు : భరించలేని శారీరక నొప్పి మనిషిని నిరాశలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది.

మంట లేదా వాపు : శరీరంలోని అంతర్గత ఇన్ఫ్లమేషన్ మెదడు పని తీరుపై ప్రభావం చూపుతుంది.

శ్వాసకోస సమస్యలు: ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఒక వ్యక్తి ఒత్తిడికి గురవడానికి కారణం అవుతాయి.

సామాజిక, పర్యావరణ ప్రభావం:  ఆత్మహత్యకు కేవలం జన్యువులే కారణం కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు కలిసి మనిషి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తికి కొన్ని రకాల జన్యుపరమైన బలహీనతలు ఉన్నప్పుడు.. విపరీతమైన ఒత్తిడి లేదా కష్టకాలం ఎదురైతే వారు ఆత్మహత్య వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది అందరికీ ఒకేలా ఉండదు.

Also Read: ఆవ నూనె ఇలా వాడితే.. చలికాలంలో మాయిశ్చరైజర్‌తో పనే లేదు !

మనం ఏం చేయాలి ?

ఈ పరిశోధన మనకు నేర్పుతున్న పాఠం ఏటంటే.. ఎవరైనా బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నారంటే వారు మానసిక ఆరోగ్యంగా ఉన్నారని అర్థ కాదు.

మరింత నిశితంగా గమనించాలి: కేవలం డిప్రెషన్ లక్షణాల కోసమే కాకుండా.. వారి జీవితంలో ఎదురయ్యే ఇతర కష్టాలను, శారీరక ఇబ్బందులను కూడా మనం అర్థం చేసుకోవాలి.

సహాయం: ఆత్మహత్య ముప్పును గుర్తించి వారికి సరైన సహాయం అందేలా చూడాలి.

నివారణ మార్గాలు: డాక్టర్లు రోగుల మానసిక ఆరోగ్యంతో పాటు వారి శారీరక ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించాల్సి ఉంటుంది.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×