E-Paper
Advertisement

Duvvada Srinivas: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

Duvvada Srinivas: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

Duvvada Srinivas: కింజరపు అప్పన్నమిస్సింగ్ వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై కీలక వ్యాఖ్యలు చేస్తబ, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై తాను ఫిర్యాదు చేసిన మరుసటి రోజునుంచే. కింజరాపు అప్పన్న కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇది సాధారణ విషయం కాదని, ఇందులో ఏదో అనుమానాస్పద కోణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పన్న తనపై దాడికి ప్లాన్ జరుగుతోందని ముందుగానే చెప్పాడని, అదే విషయాన్ని ఫోన్ కాల్‌లో స్పష్టంగా వివరించాడన్నారు.

Advertisement

ఆ ఫోన్ సంభాషణ ఆధారంగానే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే అప్పన్న మిస్సింగ్ కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. అసలు ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి అని ప్రశ్నించారు.

అప్పన్న ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియకపోవడం కుటుంబ సభ్యుల్లో.. తీవ్ర ఆందోళనకు కారణమవుతోందని దువ్వాడ తెలిపారు. ఒకవైపు తనపై దాడి కుట్ర సమాచారం, మరోవైపు ఆ సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తి అదృశ్యం కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు.

Advertisement

ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు జరపాలని దువ్వాడ శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నిజానిజాలు బయటకు తేవాలని కోరారు. అప్పన్నను త్వరగా గుర్తించి, అతని భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్ చేశారు.

ఈ కేసు రోజు రోజుకీ మలుపులు తిరుగుతుండటంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అప్పన్న ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉండగా, పోలీసుల దర్యాప్తు ఎటువైపు సాగుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Also Read: ఆ ఇద్దరే నా భర్తను కిడ్నాప్ చేశారు! అప్పన్న భార్య చెప్పిన నిజాలు

ఈ కేసు రోజు రోజుకీ మలుపులు తిరుగుతుండటంతో.. జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అప్పన్న ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×