E-Paper
Advertisement

Night shifts Risks: నైట్ షిఫ్టులతో.. ప్రాణాంతక వ్యాధి, జాగ్రత్త పడకపోతే అంతే !

Night shifts Risks: నైట్ షిఫ్టులతో.. ప్రాణాంతక వ్యాధి, జాగ్రత్త పడకపోతే అంతే !
Advertisement

Night shifts Risks: నైట్ షిఫ్టులు లేదా తరచుగా షిప్టులు మారడం వల్ల కలిగే ‘సిర్కాడియన్ డిస్రప్షన్‘ కేవలం అలసటకే పరిమితం కాకుండా.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును తీవ్రతరం చేస్తుందని టెక్సాస్ A&M యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. నిద్ర లేమి వల్ల శరీర రోగ నిరోధక శక్తి బలహీనపడటమే కాకుండా.. కంటికి కనిపించని ఒక రకమైన ‘ఇమ్యూన్ ఆఫ్ స్విచ్’ (LILRB4) ప్రేరేపితమై క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులకు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఇది రొమ్ము కణజాలం నిర్మాణాన్ని మార్చి.. క్యాన్సర్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Advertisement

జీవ గడియారం అంటే ఏంటి ?

మన శరీరంలో సహజంగా ఒక 24 గంటల అంతర్గత గడియారం ఉంటుంది. దీనినేసిర్కాడియన్ రిథమ్అంటారు. ఇది మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలి అనే కాకుండా.. శరీరంలోని హార్మోన్ల విడుదల, కణజాల మరమ్మత్తు, రోగ నిరోధక వ్యవస్థ పని తీరును సమన్వయం చేస్తుంది.

Advertisement

పరిశోధనలో తేలిన  నిజాలు:

డాక్టర్ తపశ్రీ రాయ్ సర్కార్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం.. శరీర అంతర్గత గడియారం దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ కణాలు దానిని అనుకూలంగా మార్చుకుంటాయి.

వేగవంతమైన క్యాన్సర్ అభివృద్ధి: సాధారణంగా 22 వారాల్లో అభివృద్ధి చెందే క్యాన్సర్, నిద్ర, వెలుతురు చక్రం దెబ్బతిన్న వారిలో కేవలం 18 వారాల్లోనే కనిపించింది.

వ్యాప్తి: జీవ గడియారం సరిగ్గా లేని వారిలో క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులకు చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం: నిద్ర లేమి వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ‘నిష్క్రియాత్మక’ స్థితికి వెళ్తుంది. అంటే క్యాన్సర్ కణాలను గుర్తించి చంపే శక్తిని శరీరం కోల్పోతుంది.

తాజా పరిశోధన ప్రకారం.. కణతులలోపల LILRB4 అనే ఒక ప్రత్యేక అణువులు ఉంటాయి. సాధారణంగా ఇది శరీరంలో అధిక వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ క్యాన్సర్ సమయంలో.. ఇది రోగ నిరోధక వ్యవస్థను ఆపేసే ‘ఆఫ్ స్విచ్’ లా పనిచేస్తుంది. జీవ గడియారం దెబ్బతిన్నప్పుడు ఈ అణువు అతిగా స్పందించి.. రోగ నిరోధక కణాలు క్యాన్సర్‌పై దాడి చేయకుండా అడ్డుకుంటుంది. అయితే.. శాస్త్రవేత్తలు ఈ LILRB4 అణువును టార్గెట్ చేసినప్పుడు.. నిద్ర లేమి ఉన్నప్పటికీ క్యాన్సర్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనుగొన్నారు. ఇది భవిష్యత్తులో కొత్త చికిత్సలకు మార్గం చూపుతోంది.

Also Read: కంటి చూపుపై డయాబెటిస్ పంజా.. ఈ 5 ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండండి !

ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

ప్రస్తుత ప్రపంచంలో దాదాపు 12% నుంచి 35% మంది ప్రజలు నైట్ షిఫ్టులు లేదా తరచూ మారే షిప్టుల్లో పనిచేస్తున్నారు.

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు: సాఫ్ట్‌వేర్, నర్సింగ్, సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉండేవారు.

ప్రయాణికులు: పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లు, తరచుగా ఇతర దేశాలకు వెళ్లేవారు.

క్యాన్సర్ కూడా సమయాన్ని పాటిస్తుంది. మన అంతర్గత గడియారం సరిగ్గా లేనప్పుడు అది విజృంభిస్తుంది. ఈ పరిశోధన ద్వారా నిద్ర, సరైన సమయం కేవలం విశ్రాంతికే కాదు, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణకు కూడా కీలకమని తేలింది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×