E-Paper
Advertisement

Hyderabad News: రూటు మార్చిన మహిళా టెక్కీ.. బాయ్ ఫ్రెండ్స్‌తో కొత్త వ్యాపారం, అడ్డంగా దొరికిపోయింది

Hyderabad News:  రూటు మార్చిన  మహిళా టెక్కీ..  బాయ్ ఫ్రెండ్స్‌తో కొత్త వ్యాపారం, అడ్డంగా దొరికిపోయింది
Advertisement

Hyderabad News: ఈ మధ్యకాలంలో డ్రగ్స్‌పై ఉక్కుపాద మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు కూడా. ఎక్కడికక్కడ జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా టెక్కీ అడ్డంగా బుక్కయ్యింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. 

రూటు మార్చిన మహిళా టెక్కీ

Advertisement

డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయినప్పటికీ చాపకింద నీరుగా డ్రగ్స్ వ్యాపారం గుట్టుగా సాగుతోంది. మత్తుకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత. ఈ మత్తులో నేరాలకు పాల్పడుతున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్ గుట్టు రట్టయ్యింది.

Advertisement

అదనంగా డబ్బులు సంపాదించడం కోసం మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కొత్త అవతారం ఎత్తింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె డ్రగ్స్ విక్రయిస్తోంది. కాకినాడ నుంచి వచ్చి ఆమె, హైదరాబాద్ సిటీలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అక్కడ ఏర్పడిన పరిచయాలను తన వ్యాపారానికి అనుకూలంగా మలచుకుంది. ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఆ యువతి, బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ వ్యాపారానికి తెరలేపింది.

బాయ్ ఫ్రెండ్స్‌తో డ్రగ్స్ అమ్ముతూ చిక్కింది

డ్రగ్స్ అమ్ముతుండగా పక్కా సమాచారంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ జంట నుంచి వీరి నుంచి MDMA, LSD బాటిల్స్, OG కుష్ స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌‌లో వాటి విలువ దాదాపు 4 లక్షల వరకు ఉంటుందని ఓ అంచనా. మహిళా టెక్కీతోపాటు ఆమె బాయ్ ఫ్రెండ్స్ మరో ఇద్దరు యువకులు అరెస్టయిన వారిలో ఉన్నారు.

వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటిని నగరానికి ఎవరు తీసుకొస్తున్నారు? సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడివారు? వీరితో పరిచయం ఎలా ఏర్పడింది? ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగడానికి కారణాలేంటి? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ALSO READ:  కెనడాలో దారుణం.. భారత యువతి దారుణహత్య

ఇటీవలకాలంలో డ్రగ్స్ అమ్మతున్నవారిలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది చిక్కారు. తొలిసారి మహిళా టెక్కీ ఈ వ్యాపారంలోకి రావడం ఇప్పుడే చూస్తున్నామని కొందరు పోలీసుల మాట.  వీరి దర్యాప్తులో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.  

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×