E-Paper
Advertisement

Diabetic Eye Disease: కంటి చూపుపై డయాబెటిస్ పంజా.. ఈ 5 ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండండి !

Diabetic Eye Disease: కంటి చూపుపై డయాబెటిస్ పంజా.. ఈ 5 ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండండి !
Advertisement

Diabetic Eye Disease: డయాబెటిస్ అనేది కేవలం రక్తంలోని చక్కెర స్థాయిలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇది శరీరంలోని ప్రతి ముఖ్యమైన అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది శరీరంలోని ప్రతి ముఖ్యమైన అవయవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన కళ్లు డయాబెటిస్ వల్ల తీవ్రమైన ముప్పుకు గురవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా కాలం పాటు ఎక్కువగా ఉంటే అది కంటిలోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. డయాబెటిస్ కళ్లను ప్రభావితం చేసే మార్గాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. డయాబెటిస్ రెటినోపతి:

ఇది డయాబెటిస్ రోగులలో కనిపించే అత్యంత సాధారణ , ప్రమాదకరమైన కంటి వ్యాధి. రెటినా (కంటి వెనక భాగంలో ఉండే పొర) లోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఇది సంభవిస్తుంది. ప్రారంభంలో రక్తనాళాల నుంచి రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతాయి. పరిస్థితి విషమిస్తే.. కొత్తగా బలహీనమైన రక్తనాళాలు ఏర్పడి.. అవి పగిలి చూపు పూర్తిగా కోల్పోయేలా చేస్తాయి.

Advertisement

2. డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా:

రెటినా మధ్యలో ఉండే ‘మాక్యులా‘ అనే భాగం మనకు వస్తువులు స్పష్టంగా కనిపించడానికి సహాయ పడుతుంది. డయాబెటిక్ రెటినోపతి వల్ల రక్తనాళాల నుంచి ద్రవాలు లీక్ అయి మాక్యులా వద్ద పేరుకుపోతాయి. దీని వల్ల మాక్యులా వాపుకు గురవుతుంది. దీని ఫలితంగా చదవడం, డ్రైవింగ్ చేయడం వంటి పనులకు అవసరమైన ‘నేరుగా చూసే చూపు’ మసకబారుతుంది.

3. గ్లాకోమా (కంటి ఒత్తిడి):

డయాబెటిస్ ఉన్నవారికి గ్లాకోమా వచ్చే అవకాశం ఇతరుల కంటే రెట్టింపు ఉంటుంది. కంటిలోని ద్రవాలు సరిగ్గా బయటకు వెళ్లలేనప్పుడు కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కంటి నుంచి మెదడుకు సంకేతాలను పంపే ‘ఆప్టిక్ నర్వ్’ను దెబ్బతీస్తుంది. దీనిని సకాలంలో గుర్తించక పోతే శాశ్వత అంధత్వం సంభవించవచ్చు.

4. కాటరాక్ట్ (కంటి శుక్లాలు):

కంటిలోని సహజమైన లెన్స్ మసకబారడాన్ని శుక్లాలు అంటారు. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఇవి రావచ్చు. కానీ డయాబెటిస్ ఉన్న వారిలో ఇవి చాలా చిన్న వయసులోనే.. వేగంగా వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి లెన్స్‌లో నిక్షేపాలు ఏర్పడి, అది తన పారదర్శకతను కోల్పోతుంది. దీనివల్ల చూపు పొగమంచులో చూస్తున్నట్లుగా మసకగా మారుతుంది.

5. మసకబారిన చూపు:

ఒక్కోసారి చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు చూపు మసకబారుతుంది. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు కంటి లెన్స్ ఆకారం మారి వాపుకు గురవుతుంది. దీని వల్ల దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. ఇది శాశ్వత వ్యాధి కాకపోయినా. షుగర్ లెవల్స్ నియంత్రణలోకి రాకపోతే ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

Also Read: రోజంతా ‘ఫ్రెష్‌’గా ఉండాలా? పర్ఫ్యూమ్ మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలంటే ఇవి పాటించండి

నివారణ మార్గాలు:

క్రమం తప్పకుండా కంటి పరీక్షలు: డయాబెటిస్ ఉన్నవారు కనీసం ఏడాదికి ఒకసారి ‘డైలేటెడ్ ఐ ఎగ్జామ్’ చేయించుకోవాలి.

షుగర్ నియంత్రణ: HbA1c స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వల్ల 90% కంటి సమస్యలను నివారించవచ్చు.

బీపీ, కొలెస్ట్రాల్: రక్తపోటును అదుపులో ఉంచుకోవడం కంటి రక్తనాళాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

డయాబెటిక్ కంటి వ్యాధులు ప్రారంభ దశలో ఎటువంటి నొప్పిని కలిగించవు. అందుకే చూపులో మార్పు వచ్చే వరకు వేచి చూడకుండా.. క్రమబద్ధమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే మీ కళ్ళను కాపాడుకునే మార్గం.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×