E-Paper
Advertisement

దంపతుల మధ్య గొడవలు జరగపోతే సమస్య ఉన్నట్లే.. ప్రేమ తగ్గిందని తెలిపే సంకేతాలు ఇవే

దంపతుల మధ్య గొడవలు జరగపోతే సమస్య ఉన్నట్లే.. ప్రేమ తగ్గిందని తెలిపే సంకేతాలు ఇవే
Advertisement

చాలామంది సంబంధంలో ఎలాంటి గొడవలు లేకపోతే అంతా సజావుగా సాగుతోందని, ఇద్దరి మధ్య ప్రేమ అనుబంధం ఉన్నట్లుగా అందరూ భావిస్తారు. బయటకు చూస్తే అన్నీ ప్రశాంతంగా, సంతోషంగా కనిపించవచ్చు. కానీ ప్రతి ప్రశాంతమైన సంబంధంలో అంతా బాగుందని చెప్పలేం. కొన్ని సమస్యలు రోజువారీ అలవాట్లు, చిన్న చిన్న ప్రవర్తనల వెనుక దాగి ఉంటాయి. వాటిని ముందుగానే గుర్తిస్తే సంబంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.

ఎప్పుడూ గొడవలు లేకపోవడం మంచి సంకేతం కాకపోవచ్చు

ప్రతి ఆరోగ్యకరమైన సంబంధంలో అభిప్రాయ భేదాలు సహజం. ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించరు. భిన్నమైన అభిప్రాయాలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

Advertisement

అయితే గొడవలు రాకూడదనే ఉద్దేశంతో మీ భావాలను ఎప్పుడూ వ్యక్తపరచకపోతే అది సమస్యగా మారవచ్చు. మనసులోని బాధలు, అసంతృప్తిని అణచిపెట్టడం వల్ల కాలక్రమంలో నిరాశ, కోపం పెరుగుతాయి. మంచి సంబంధంలో భాగస్వాములు తమ అభిప్రాయాలను గౌరవంగా, బాహాటంటా వ్యక్త పరుస్తారు.

మీ జీవితమంతా సంబంధం చుట్టూనే తిరగకూడదు

పెళ్లి అయిన కొత్తలో ఎక్కువ సమయం కలిసి గడపడం సహజం. కానీ క్రమంగా మీ స్నేహితులు, హాబీలు, వ్యక్తిగత లక్ష్యాలను పూర్తిగా పక్కనపెడితే సమస్యలు రావచ్చు. అందుకే మీ సంతోషం పూర్తిగా మీ జీవిత భాగస్వామిపైనే ఆధారపడకూడదు. ఆరోగ్యకరమైన సంబంధం వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇద్దరూ తమ ఆసక్తులు, స్నేహాలు, లక్ష్యాలను కొనసాగించాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం బంధాన్ని మరింత బలపరుస్తుంది.

ప్రతి క్షమాపణకు కారణాలు చెప్పడం సరైంది కాదు

Advertisement

సంబంధంలో తప్పులు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం.. తన తప్పును అంగీకరించడం. అయితే కొందరు క్షమాపణ అడిగినా అందులో చిన్నగా షరతులు పెడతారు. “క్షమించు, కానీ…” అని చెప్పి వెంటనే తమ ప్రవర్తనకు కారణాలు చెబుతారు. ఇలా చేయడం వల్ల అసలు సమస్య నుంచి దృష్టి మళ్లిపోతుంది. ఎదుటివారికి తమ భావాలను పట్టించుకోలేదనే భావన కలుగుతుంది. మంచి సంబంధంలో తప్పును నిజాయితీగా అంగీకరించి దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి.

భయంతో చిన్న విషయాలు దాచిపెట్టడం ప్రమాదకరం

నమ్మకం అనేది ఏ సంబంధానికైనా పునాది. భాగస్వామితో భయం లేకుండా మాట్లాడగలగడం చాలా ముఖ్యం.
కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలను కూడా దాచిపెట్టడం ప్రారంభమవుతుంది. అవి చిన్న అబద్ధాలుగా కనిపించినా, వాటి వెనుక భయం లేదా అసౌకర్యం దాగి ఉండవచ్చు. ఒకరితో ఒకరు నిజాయితీగా మాట్లాడలేకపోతే నమ్మకం క్రమంగా తగ్గిపోతుంది.

Also Read: ఇంట్లో అతిథులు రాగానే ఒత్తిడి పెరుగుతుందా? వాస్తు ప్రకారం ఈ తప్పులే కారణం

ప్రేమ భాగస్వామి మూడ్‌పై ఆధారపడకూడదు

నిజమైన ప్రేమ స్థిరంగా ఉండాలి. ఒకరి మూడ్ బాగున్నప్పుడు మాత్రమే ప్రేమ, ఆప్యాయత చూపించి, మూడ్‌ బాగాలేప్పుడు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది కాదు.

ఇలాంటి పరిస్థితి సంబంధంలో అసురక్షిత భావనను పెంచుతుంది. భాగస్వామి ప్రేమ ఎప్పుడూ లభిస్తుందో లేదో అనే సందేహం కలుగుతుంది. ఆరోగ్యకరమైన బంధంలో మంచి రోజుల్లోనే కాదు, కష్ట సమయాల్లో కూడా పరస్పర మద్దతు, ప్రేమ ఉండాలి.

ఆరోగ్యకరమైన సంబంధానికి ఈ లక్షణాలు అవసరం

ప్రతి అనారోగ్యకరమైన సంబంధం బయటకు స్పష్టంగా కనిపించదు. కొన్ని హెచ్చరిక సంకేతాలు సాధారణ ప్రవర్తనల వెనుక దాగి ఉంటాయి. నిజాయితీ, పరస్పర గౌరవం, స్వతంత్రత, బాధ్యత, భావోద్వేగ భద్రత ఉన్నప్పుడు మాత్రమే సంబంధం దీర్ఘకాలం బలంగా ఉంటుంది. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం ద్వారా మరింత అర్థవంతమైన, సంతోషకరమైన బంధాన్ని నిర్మించుకోవచ్చు.

Related News

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

Big Stories

Advertisement
×