E-Paper
Advertisement

భార్యాభర్తల మధ్య చిచ్చు.. గదిలో రకరకాలుగా చిత్రహింసలు, పారిపోతుండగా కత్తితో దాడి

భార్యాభర్తల మధ్య చిచ్చు.. గదిలో రకరకాలుగా చిత్రహింసలు, పారిపోతుండగా కత్తితో దాడి
Advertisement

Mumbai Crime: ఆస్తి తగాదాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి. దీని ఫలితంగా భార్యభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. చివరకు భార్యని గంటల తరబడి రకరకాల భంగిమలతో నిలబెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. ప్రాణభయంతో పుట్టింటికి పారిపోయిన ఆమెను వెంటాడి కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చివరకు నిందితుడు పోలీసులు చిక్కాడు.

ముంబైలో గృహ హింస.. భార్యాభర్తల మధ్య చిచ్చు

Advertisement

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహ హింస ఘటన బయటకు వచ్చింది. 25 ఏళ్ల అర్బాజ్ సయ్యద్ స్వంతహాగా రౌడీ షీటర్. అతడు.. భార్య మధ్య కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఎంత చెప్పినా తన మాట వినలేదని ఇంట్లో భార్యను ఓ గదిలో బంధించాడు. కత్తి చూపించి చంపేస్తాను.. యాసిడ్ పోస్తానని భార్యని బెదిరించాడు.

ఇక అంతటితో ఆగలేదు.. తన పైత్యాన్ని బయట పెట్టుకున్నాడు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ రకాల భంగిమల్లో నిలబెట్టి పైశాచిక ఆనందం పొందాడు సదరు రౌడీ షీటర్.  భర్త బయటకు వెళ్లగానే అక్కడి నుంచి  తప్పించుకుంది. ప్రాణభయంతో తన పుట్టింటికి పరుగులు తీసింది.

Advertisement

భార్యని గదిలోకి తీసుకెళ్లి రకరకాల భంగిమలతో టార్చర్.. ఆపై కత్తితో దాడి

ఈ విషయం తెలుసుకున్న అర్బాజ్.. నేరుగా అత్తగారింటికి చేరుకున్నాడు. అక్కడ భార్యపై ఆగ్రహంతో ఊగిపోయాడు. తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. జరుగుతున్న పరిణామాలకు భయపడి పోయిన బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. అర్బాజ్‌కు నేర చరిత్ర పరిశీలించి పోలీసులు, హత్యాయత్నం, దోపిడీ వంటి 19 తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై హత్యాయత్నం, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ALSO READ: భర్త కళ్ల ముందే, ఆ పని చేసిన దుండగులు, హైదరాబాద్ లో దారుణమైన ఘటన 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×