E-Paper
Advertisement

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్
Advertisement

Numerology Life long Love| ప్రేమలో కొంతమంది దంపతులు ఎన్నేళ్లు గడిచినా ఒకరిపై ఒకరికి అదే ఆప్యాయతను చూపిస్తుంటారు.
వారి బంధంలో ప్రేమతో పాటు స్నేహం, అవగాహన, ఆకర్షణ కూడా కొనసాగుతాయి. న్యూమరాలజీ నమ్మకాల ప్రకారం.. కొన్ని మూల అంకాల కలయికలు ఇలాంటి బంధానికి అనుకూలంగా ఉంటాయి. అయితే కేవలం మూల అంకాల ఆధారంగా ప్రేమ ఎంతకాలం కొనసాగుతుందో నిర్ణయించలేం. నమ్మకం, గౌరవం, మంచి కమ్యూనికేషన్, పరస్పర అవగాహన కూడా బంధానికి చాలా ముఖ్యమైనవి.

మూల అంకాలు 2, 6 జంటకు ప్రేమతో పాటు ఆప్యాయత కూడా

2, 11, 20 లేదా 29 తేదీల్లో పుట్టినవారిని మూల అంకం 2గా పరిగణిస్తారు. అలాగే 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టినవారిని మూల అంకం 6గా పరిగణిస్తారు. అంక జ్యోతిష్య నమ్మకాల ప్రకారం.. మూల అంకం 2.. ఉన్న వ్యక్తులు ఎక్కువ భావోద్వేగాలు, సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. మూల అంకం 6 ప్రేమ, అందం, ఆకర్షణ, అనుబంధానికి ప్రతీక. ఈ రెండు మూల అంకాల.. జంటలో మానసిక అవగాహన బలంగా ఉంటుంది. ఒకరికి మరొకరు ప్రేమ, శ్రద్ధ, భావోద్వేగ మద్దతు అందించవచ్చు.

మూల అంకాలు 3, 6 జంటలో మంచి కెమిస్ట్రీ

Advertisement

3, 12, 21 లేదా 30 తేదీల్లో పుట్టినవారిని మూల అంకం 3గా పరిగణిస్తారు. ఈ జన్మ సంఖ్యలు ఉన్న వ్యక్తులను ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా, సానుకూలంగా ఉండేవారిగా అంక జ్యోతిష్యం వివరిస్తుంది. అలాగే మూల అంకం 6 ప్రేమ, ఆకర్షణ, అందంతో ముడిపడి ఉంటుంది. ఈ రెండు సంఖ్యలు కలిస్తే మంచి అనుబంధం ఏర్పడవచ్చని నమ్ముతారు. వీరు కలిసి ప్రయాణాలు, కొత్త అనుభవాలు, వేడుకలను ఆస్వాదిస్తారు. ఇలాంటి ఉత్సాహం దీర్ఘకాలిక బంధంలో కొత్తదనాన్ని కొనసాగిస్తారు.

మూల అంకాలు 1, 5 జంటలో ఉత్సాహం ఎక్కువ

1, 10, 19 లేదా 28 తేదీల్లో పుట్టినవారికి మూల అంకం 1 వస్తుంది. 5, 14 లేదా 23 తేదీల్లో పుట్టినవారిని మూల అంకం 5గా పరిగణిస్తారు. మూల అంకం 1ను ఆత్మవిశ్వాసం, నాయకత్వం, స్వతంత్ర ఆలోచనలకు ప్రతీకగా భావిస్తారు. మూల అంకం 5 మార్పు, స్వేచ్ఛ, ఆసక్తి, సాహసంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ భిన్నమైన లక్షణాలు బంధంలో ఉత్సాహాన్ని కొనసాగిస్తారు. ఒకరికొకరు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వడం కూడా ఈ బంధానికి ఉపయోగపడుతుంది.

మూల అంకాలు 3, 9 జంటలో బలమైన అనుబంధం

Advertisement

9, 18 లేదా 27 తేదీల్లో పుట్టినవారిని మూల అంకం 9గా పరిగణిస్తారు. మూల అంకం 3, 9లను ఉత్సాహం, శక్తి, ఆత్మవిశ్వాసంతో అనుసంధానిస్తారు. ఇద్దరూ ఒకరి లక్ష్యాలను మరొకరు అర్థం చేసుకుని ప్రోత్సహించుకుంటారని న్యూమరాలజీ చెబుతోంది. అభిప్రాయాలను గౌరవించుకుంటే వారి బంధం మరింత బలపడుతుంది. స్నేహం, ప్రేమ, భాగస్వామ్యం మధ్య మంచి సమతుల్యత ఉంటే అనుబంధం కొనసాగస్తారు.

Also Read: తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

నిజమైన ప్రేమను నిలబెట్టేది నమ్మకమే

అంక జ్యోతిష్యం వ్యక్తిత్వం, సంబంధాల గురించి కొన్ని నమ్మకాలను మాత్రమే చెబుతుంది. ఏ జంట జీవితాంతం కలిసి ఉంటుందో మూల అంకాలు కచ్చితంగా చెప్పలేవు. ప్రతి బంధానికి నమ్మకం, గౌరవం, నిజాయితీ, సహనం ఎంతో అవసరం. భాగస్వాములు తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోవడం కూడా ముఖ్యమే. ఒకరి పరిమితులు, అభిప్రాయాలు, వ్యక్తిగత లక్ష్యాలను మరొకరు గౌరవించాలి. ఇలా ఇద్దరూ ప్రయత్నిస్తే ఏళ్లుగా ఉన్న బంధంలో కూడా ప్రేమ కొత్తగానే అనిపించవచ్చు.

గమనిక: ఈ సమాచారం సంప్రదాయ న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు, అలాగే ఇది జీవితంలో ప్రేమకు సంబంధించిన ఎటు హామీ హామీ ఇవ్వదు. ముఖ్యమైన వ్యక్తిగత నిర్ణయాలను కేవలం మూల అంకాల ఆధారంగా తీసుకోకండి.

Also Read: అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Tags

Related News

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×