Jio vs Airtel: ఇంట్లో మంచి వైఫై కనెక్షన్ పెట్టించాలి అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి జియోఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్. ఈ రెండూ కూడా రూ.999 ప్లాన్‌తో మంచి ఆఫర్లనే ఇస్తున్నాయి. రెండు ప్లాన్లు పైన కనిపిస్తున్న ధరలో ఒకేలా ఉన్నా.. అవి ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. మరి మీ అవసరాలకు ఏది బాగా సెట్ అవుతుందో, ఏ ప్లాన్ ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందామా..
ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో జియో కాస్త ముందంజలో ఉందనే చెప్పాలి. జియో రూ.999 ప్లాన్‌లో 150 Mbps స్పీడ్ ఇస్తుంటే.. ఎయిర్‌టెల్ మాత్రం 100 Mbps స్పీడ్ మాత్రమే అందిస్తోంది. డేటా విషయానికి వస్తే.. రెండింట్లోనూ నెలకు 3.3 TB వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఫైబర్ కాకుండా ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మాత్రం రెండింట్లోనూ నెలకు 1 TB మాత్రమే డేటా లిమిట్ ఉంటుంది.
Also Read: లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!
సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసేవారికి ఈ రెండు ప్లాన్లు మంచి వినోదాన్ని అందిస్తాయి. జియోలో అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5తో పాటు దాదాపు 13కి పైగా రకాల యాప్‌లు ఉచితంగా వస్తాయి. ఎయిర్‌టెల్ కూడా ఏమాత్రం తగ్గకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్, జీ5లతో పాటు గూగుల్ వన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియమ్‌ను కూడా ఉచితంగా ఇస్తోంది.
మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండి, ఎక్కువ ఛానెళ్లు చూడాలనుకుంటే జియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో 1000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లను చూసే వెసులుబాటు ఉంది. ఇక ఎయిర్‌టెల్ విషయానికి వస్తే.. మీరు 3, 6 లేదా 12 నెలల ప్లాన్ ఒకేసారి తీసుకుంటే ఇన్స్టాలేషన్, రూటర్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తుంది. జియోలో కూడా 3, 6, 12 నెలల వాలిడిటీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి.
మీకు ఎక్కువ స్పీడ్, లైవ్ టీవీ ఛానెళ్లు కావాలనుకుంటే కళ్లు మూసుకుని జియో ప్లాన్ వైపు వెళ్లొచ్చు. అలా కాకుండా మీకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, యాపిల్ టీవీ ప్లస్ లాంటి ప్రీమియం కంటెంట్ లేదా వర్క్ కోసం అడోబ్ యాప్స్ కావాలనుకుంటే ఎయిర్‌టెల్ మీకు సరైన ఛాయిస్ అవుతుంది. మీ ఇంట్లో ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయో చూసుకొని ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి.
Also Read: 90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!