న్యూమరాలజీ ప్రకారం కొన్ని జన్మసంఖ్యలకు ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయని నమ్ముతారు. కొందరు కొత్తగా ఆలోచించడం కంటే ఇతరుల క్రియేటివ్ ఐడియాలను తమ లాభం కోసం ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. ఇతరుల పని విధానం, ఆలోచనలు, వ్యూహాలను పరిశీలించి వాటిని తమ శైలిలో ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవన్నీ సంప్రదాయ నమ్మకాల ఆధారంగా ఉన్న అభిప్రాయాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
న్యూమరాలజీ ప్రకారం కొందరు వ్యక్తులు ఇతరుల విజయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. వారు వ్యాపార పద్ధతులు, సృజనాత్మక ఆలోచనలు, పని చేసే విధానాలను పరిశీలిస్తారు. తరువాత వాటిని కొద్దిగా మార్చి తమ సొంత ఆలోచనలుగా చూపించడానికి ప్రయత్నించవచ్చు. ఈ కారణంగా అసలు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది.
5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వారి జన్మసంఖ్య 5గా పరిగణిస్తారు. న్యూమరాలజీ ప్రకారం వీరు తెలివిగా, పరిశీలన శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. విజయవంతమైన ఐడియాలను చాలా త్వరగా గుర్తిస్తారు. ఎక్కువ సమయం పరిశోధన చేయడం కంటే అంతకుముందు ఎవరైనా కొత్తగా చేసిన విధానాలను పరిశీలిస్తారు. వాటిలో చిన్న మార్పులు చేసి కొత్త రూపంలో అందించే ప్రయత్నం చేయవచ్చు. ఈ కారణంగా వీరిని చురుకైన ఆలోచనాపరులుగా కూడా భావిస్తారు.
Also Read: ఈ తేదీల్లో పుట్టినవారు ఛాంపియన్స్.. పెద్ద పెద్ద విజయాలు త్వరగా సాధిస్తారు
7, 16 లేదా 25 తేదీలలో జన్మించిన వారి జన్మసంఖ్య 7గా భావిస్తారు. వీరు ఎక్కువ మాట్లాడటం కంటే ఎక్కువగా గమనించడాన్ని ఇష్టపడతారు. ఇతరుల పనితీరు, ఆలోచనలు, వ్యూహాలను ఓపికగా పరిశీలిస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు వాటిని తమ పనిలో ఉపయోగించవచ్చు. అందుకే వీరు రహస్యంగా వ్యవహరించే వ్యక్తులుగా కనిపించవచ్చు.
3, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించిన వారి జన్మసంఖ్య 3గా పరిగణిస్తారు. వీరు ఇతరుల క్రియేటివ్ ఐడియాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఏదైనా ఆలోచన నచ్చితే దాన్ని కొత్త రూపంలో చూపించే ప్రయత్నం చేస్తారు. వారి ప్రదర్శన ఆకర్షణీయంగా ఉండటం వల్ల అది పూర్తిగా కొత్త ఆలోచనలా అనిపించవచ్చు.
న్యూమరాలజీ ప్రకారం కొందరు బయటకు ఆసక్తి లేనట్టుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటారు. తరువాత అదే విధానాన్ని తమ పనిలో ఉపయోగిస్తారు. ఈ ప్రవర్తన కొన్నిసార్లు అసలు ఐడియా కల వారిని ఆశ్చర్యపరుస్తుంది.
కొన్ని న్యూమరాలజీ అభిప్రాయాల ప్రకారం ఇలాంటి వ్యక్తులు ఇతరుల ఆలోచనలను ఉపయోగించినా అంగీకరించకపోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే తమకు తెలియనట్టు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల అపార్థాలు ఏర్పడే అవకాశమూ ఉంటుంది.
న్యూమరాలజీ ప్రకారం జన్మసంఖ్యలు 3, 5, 7 ఉన్నవారిలో పరిశీలన శక్తి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. ఈ లక్షణాలను కొందరు కొత్త ఆలోచనలు సృష్టించడానికి ఉపయోగిస్తారు. మరికొందరు ఇప్పటికే విజయవంతమైన పద్ధతులను అనుసరించవచ్చు. అయితే ప్రతి వ్యక్తి ప్రవర్తన అతని పెంపకం, విలువలు, అనుభవాలపై ఆధారపడి ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం సంప్రదాయ న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. సరైన సూచనలు, సలహాల కోసం నిపుణలను సంప్రదించండి.