E-Paper
Advertisement

అపరిచితుడితో జంప్ అవ్వాలనుకునే అమ్మాయి… తమిళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అపరిచితుడితో జంప్ అవ్వాలనుకునే అమ్మాయి… తమిళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
Advertisement

Tamil Romantic Drama: ఊటీ అంటేనే ప్రకృతి పారవశ్యం… మంచు కప్పిన పచ్చని కొండలు, ఉల్లాసంగా ఉండే ఉదయాలు, దట్టమైన అడవులు… ఇలాంటి ప్లేస్ లో ఎవరైనా సంతోషంగా బతికేస్తాము అనుకుంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం మొహం కూడా తెలియని వ్యక్తితో జంప్ అవ్వాలని ఆలోచిస్తుంది. మరి అలాంటి ఆలోచనలు వస్తే ఏం జరుగుతుందో తెలియాలి అంటే ‘Mylanji’ అనే తమిళ ప్యూర్ ఎమోషనల్ డ్రామాపై ఒక లుక్కేయాల్సిందే. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి ఎప్పుడు వచ్చింది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో మన హీరో పేరు సూర్య. అతను నేషనల్ జియోగ్రాఫిక్ ఫొటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన చిన్నప్పుడు జరిగిన ఒక షాకింగ్ సంఘటన వల్ల మాటలు సరిగా రావు. ఈ స్పీచ్ డిజార్డర్ కారణంగా అతను చాలా కష్టపడతాడు. కానీ కెమెరా ద్వారా ప్రకృతి అందాలను, వైల్డ్ లైఫ్‌ను క్యాప్చర్ చేయడంలో అతను ఎక్స్‌పర్ట్. ఊటీలో ఒక అరుదైన పక్షిని ఫోటో తీయాలనే ఉద్దేశంతో అతను అక్కడికి వెళతాడు.

Advertisement

ఊటీ అందమైన కొండలు, మంచు తాకిడి, పచ్చని అడవుల మధ్య సూర్య తన కెమెరాతో తిరుగుతూ ఉంటాడు. అక్కడ అతనికి చారు అనే అనాథ అమ్మాయి పరిచయం అవుతుంది. చారుకు తల్లిదండ్రులు ఉండరు. తన మేనత్త, మావయ్యల డగ్గర పెరుగుతుంది. ఆమె జీవితం కష్టాల కడలిలో కొట్టుకుంటూ ఉంటుంది. ఆమె మేనత్తకు బాధ్యతలు అంటే ఏంటో తెలియని కొడుకు ఉంటాడు. వాడితో చారుకు బలవంతపు పెళ్లి చేయాలని అత్త డిసైడ్ అవుతుంది.

ఆ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చారు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే సూర్యను ఒక ఉపాయం అడుగుతుంది. తాను గతంలో ప్రేమించిన కతిర్ అనే యువకుడిని వెతికి, తనను అతనితో కలపమని రిక్వెస్ట్ చేస్తుంది. సూర్య మనసులో చారుపై ప్రేమ ఉన్నప్పటికీ, ఆమె సంతోషం కోసం ఆ కోరికను నెరవేర్చడానికి ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి చెన్నై వెళ్లి కతిర్‌ను వెతకడం మొదలు పెడతారు.

Advertisement

ఈ ప్రయాణం సూర్య, చారు మధ్య ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. ఊటీ నుంచి చెన్నై వరకు వాళ్ళు చేసే ప్రయాణం చిన్న చిన్న అపార్థాలు, ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకుంటుంది. సూర్య తన మాటల లోపాన్ని అధిగమించి చారుతో తన భావాలను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చారు కూడా తన గత బాధలను, కతిర్ మీద ఉన్న ఆశలను సూర్యతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో కతిర్ గురించి హీరోయిన్ కు తెలిసిన షాకింగ్ నిజం ఏంటి ? ఆ తరువాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? చివరకి హీరో హీరోయిన్ ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా ? పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడుతున్న తన బావను హీరో హీరోయిన్ ఎలా వదిలించుకున్నారు ? అన్నది తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

2026లో వచ్చిన తమిళ సినిమా ‘మైలాంజి’. ఇళయరాజా సంగీతంతో, అజయన్ బాలా దర్శకత్వంలో రూపొందిన ప్యూర్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… జులై 24 నుంచి ఆహా ఓటీటీలో తమిళ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. కాబట్టి సినిమాను ఇంగ్షీషు సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది.

Read Also: ప్రియుడిని బాయ్ ఫ్రెండ్ తో కలిసి… గుండె రాయిలా ఉంటేనే ఈ సినిమాను చూడండి

Tags

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×