E-Paper
Advertisement

OTT Apps banned:కేంద్రం కఠిన నిర్ణయం.. 50 ఓటీటీలు బ్యాన్!

OTT Apps banned:కేంద్రం కఠిన నిర్ణయం.. 50 ఓటీటీలు బ్యాన్!
Advertisement

OTT Apps banned: థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని ఎంతోమంది ఆడియన్స్ ఓటీటీని ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. తమకు నచ్చిన సమయంలో.. నచ్చిన సినిమాను.. ఫ్యామిలీతో కలిసి చూసే అవకాశాన్ని ఓటీటీలు కల్పిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేక్షకులకు విభిన్నమైన జానర్ లలో సినిమాలను అందిస్తూ.. మంచి పేరు సంపాదించుకుంటున్నాయి. అయితే కొన్ని ఓటీటీలు మాత్రం రూల్స్ కి విరుద్ధంగా.. అశ్లీల కంటెంట్ ను, అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా కఠిన నిర్ణయం తీసుకుంటూ 50 ఓటీటీ యాప్ లపై బ్యాన్ విధించింది.

50 ఓటీటీ యాప్ లపై బ్యాన్ విధించిన ప్రభుత్వం..

వినియోగదారులకు అసభ్యకరమైన కంటెంట్ ను అందిస్తున్న ఈ ప్లాట్ ఫారమ్ లకు దేశవ్యాప్తంగా యాక్సిస్ ను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది 25 యాప్ లు , ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5 యాప్ లపై కఠిన చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా 50 ఓటీటీ యాప్ లను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఈ ఓటిటి యాప్స్ బ్యాన్ పై లోకసభలో కేంద్ర మంత్రి వెల్లడించారు.

అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేయడంపై కఠిన చర్యలు

Advertisement

కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ (Dr.L. Murugan)లోకసభలో లిఖితపూర్వక సమాధానాన్ని ఇస్తూ.. అశ్లీల అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేసినందుకుగానూ 50 ఓటీటీలపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లను నిరంతరం పర్యవేక్షిస్తోందని , చట్టాలను ఉల్లంఘించే యాప్ లపై అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. ఇకపోతే బ్లాక్ చేసిన ఆయా 50 ఓటీటీ యాప్ ల జాబితాను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. చట్ట విరుద్ధమైన లేదా అభ్యంతరకర కంటెంట్ ను ప్రదర్శించే ఏ డిజిటల్ ప్లాట్ఫారం పై అయినా ఇలా చర్య తీసుకోబడుతుందని ముందస్తు హెచ్చరిక చేశారు.

also read:సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. అక్కడే అసలు ట్విస్ట్!

గూగుల్ ప్లే స్టోర్ , ఆపిల్ యాప్ స్టోర్ లను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం..

Advertisement

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిషేధిత యాప్లను వినియోగదారులు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ యాప్ లకు యాక్సెస్ లేకుండా బ్లాక్ చేయాలని అటు ఆపిల్ యాప్ స్టోర్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ లకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఆయా యాప్ లను వెంటనే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.

పలు సెక్షన్ల కింద కేసు ఫైల్..

ఈ యాప్లపై కేంద్ర ప్రభుత్వం సమాచార, సాంకేతిక నిబంధనలు 2021 ప్రకారం చర్యలు తీసుకుంది. అధికారుల పరిశీలనలో.. ఈ ఫ్లాట్ ఫారంలోని కంటెంట్ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ లో 294 నిబంధనలను ఉల్లంగించడం, మహిళల అసభ్య ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 4 కి విరుద్ధంగా ఉండడం వంటి అంశాలను గుర్తించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. అందుకే ఆయా యాప్ లకు యాక్సిస్ ను నిరోధించాలని కేంద్రం నిర్ణయం తీసుకొని ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకైనా.. ఇకపై పలు ఓటీటీ యాప్ లు ఇలాంటి అసభ్యకర కంటెంట్ ను ప్రసారం చేయకుండా ఉంటారేమో చూడాలి.

Related News

పాడుబడిన బావిలో పగతో రగిలిపోయే యువరాణి… తెలుగులో లేటెస్ట్ మలయాళం హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

అపరిచితుడితో జంప్ అవ్వాలనుకునే అమ్మాయి… తమిళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అమ్మాయి అందంగా ఉందని సొళ్ళు కారిస్తే అరాచకం… తండ్రిని చంపమంటూ షరతు

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే

రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. అక్కడే అసలు ట్విస్ట్!

బేస్మెంట్ లోని సొరంగంలోకి ఆత్మలను లాక్కెళ్ళే దుష్టశక్తి… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×