E-Paper
Advertisement

పాలు పలచగా ఉన్నా రుచికరమైన చిక్కటి టీ రెడీ.. సులభంగా ఇది కలిపితే చాలు

పాలు పలచగా ఉన్నా రుచికరమైన చిక్కటి టీ రెడీ.. సులభంగా ఇది కలిపితే చాలు
Advertisement

Less Milk Creamy Tea| ఇంట్లో టీ తయారు చేసేటప్పుడు చాలా మందికి ఒక సాధారణ సమస్య ఎదురవుతుంది. పాలు తక్కువగా ఉండటం లేదా పాలలో నీళ్లు ఎక్కువైపోవడం వల్ల టీ పలుచగా, రుచి లేకుండా వస్తుంది. నీరు ఎక్కవగా ఉంటే టీ పలుచబారిపోయి తాగేటప్పుడు తృప్తి ఉండదు. కానీ చేసే ఒక సాధారణ ఉపాయంతో పాలు తక్కువైనా గట్టి, క్రీమీ టీ సులభంగా తయారు చేయవచ్చు.

టీ ఎందుకు పలచగా వస్తుంది

ఎక్కువ నీళ్లు పోస్తే లేదా తక్కువ పాలతో టీ చేస్తే పలచబడుతుంది. లో ఫ్యాట్ పాలు అంటే సాధారణ స్టాండర్డ్ ప్యాకెట్ పాలు వాడితే టీ చిక్కగా ఉండదు. త్వరగా మరిగించడం వల్ల కూడా టీ రుచి తక్కువగా ఉంటుంది. తగిన సమయం మరిగస్తేనే టీ పొడి నుంచి రంగు, రుచి బాగా వస్తాయి.

ఇంట్లో పురాతన పద్ధతి

Advertisement

పాలు తక్కువగా ఉంటే చిక్కటి టీ కోసం ఒక ట్రిక్ ఉంది. పంచదారను వేయించడం ద్వారా ఈ ఉపాయం మొదలవుతుంది. దీంతో టీకి మంచి రంగు, రుచి చిక్కదనం ఇస్తుంది. పాలు తక్కువైనా టీ రుచికరంగా మారుతుంది.

టీ తయారు చేసే విధానం

ముందుగా ఒక పాన్‌ను స్టవ్ మీద పెట్టి తక్కువ మంట మీద వేడి చేయండి. రెండు టీస్పూన్ల పంచదార, వేసి కలుపుతూ కాల్చండి. పంచదార గోధుమ రంగు వచ్చేవరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత రెండు టీస్పూన్ల నీళ్లు పోసి కొద్దిగా గట్టి సిరప్ లాగా చేయండి. ఇందులో కాస్త దంచిన యాలకులు (ఇలాయిచీ), టీ పొడి వేయండి. ఒకటి లేదా రెండు కప్పుల నీళ్లు పోసి మరగించండి. టీ సువాసన వచ్చేవరకు మరిగించండి. కావాలంటే టీ మసాలా కూడా జోడించవచ్చు. ఇప్పుడు ఉన్నంత పాలు పోయండి. తక్కువ మంట మీద రెండు నిమిషాలు మరిగించండి. వడకట్టి వేడిగా సర్వ్ చేయండి. పాలు తక్కువైనా టీ చిక్కగా, క్రీమీగా వస్తుంది.

Advertisement

Also Read: ఈ మాత్ర వేసుకుంటే బట్టతల రాదు.. జుట్టు రాలే సమస్యకు చెక్?

టీ రుచి మెరుగుపరచడానికి అదనపు చిట్కాలు

ఎప్పుడూ స్ట్రాంగ్ టీ పొడి వాడండి. ఎక్కువ టీ ఆకులు వేస్తే టీ కూడా స్ట్రాంట్‌గా వస్తుంది. టీని సరిగ్గా మరగించాలి. ఎక్కువసేపు మరిగిస్తే రుచి, రంగు బాగా వస్తాయి. సాధ్యమైతే పూర్తి ఫుల్ క్రీమ్ పాలు వాడండి. అదనంగా అల్లం లేదా ఇలాయిచీ ఎక్కువగా వేయవచ్చు. ఇవి టీకి మంచి రుచి ఇస్తాయి.

ఈ తప్పులు చేయకండి

టీలో ఎక్కువ నీళ్లు పోయకండి. స్కిమ్ పాటు లేదా లో ఫ్యాట్ పాలు వాడకండి. పాలు పోసిన తర్వాత కూడా బాగా మరగించాలి. లేకపోతే టీ పలచగా ఉంటుంది.

చిక్కటి టీ కోసం పాలు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ సాధారణ ఉపాయంతో పాలు తక్కువైనా చిక్కని, రుచికరమైన టీ తయారు చేయవచ్చు. ఇంట్లో పాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×