E-Paper
Advertisement

పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకపోవడానికి తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే కారణం..

పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకపోవడానికి తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే కారణం..
Advertisement

తల్లిదండ్రులందరూ పిల్లలు చదువులో బాగా రాణించాలని, విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లలు చదువు పట్ల ఆసక్తి కోల్పోతారు. నిరంతర ఒత్తిడి, పోలికలు, అసాధ్యమైన లక్ష్యాలు, ఆశలు.. పిల్లల మోటివేషన్‌ను దెబ్బతీస్తాయి. అందుకే పిల్లలను కఠినంగా నియంత్రించడం కంటే వారికి మానసికంగా మంచి మద్దతు ఇవ్వడం బెటర్.

పిల్లలను ఇతరులతో పోల్చడం

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తోటి విద్యార్థులు, సోదరులు లేదా బంధువులతో తరచుగా పోల్చుతుంటారు. ఈ పోలికలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని మానసిక భద్రతను దెబ్బతీస్తాయి. పిల్లలు తాము ఎంత ప్రయత్నం చేసినా ఇతరుల కంటే తక్కువ అనే భావనతో నిరుత్సాహ పడతారు. ప్రతి పిల్లవాడి నేర్చుకునే సామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది. నిరంతర పోలికలు ఆత్మగౌరవాన్ని తగ్గించి చదువు పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. వ్యక్తిగత పురోగతిని ప్రోత్సహించడం మంచిది.

చదువుపై అధిక ఒత్తిడి పెట్టడం

Advertisement

కొందరు తల్లిదండ్రులు.. పిల్లలు పర్ఫెక్ట్ మార్కులు తెచ్చుకోవాలని, ఎప్పుడూ టాప్ చేయాలని ఆశిస్తారు. ఈ అధిక ఒత్తిడి వల్ల పిల్లల్లో స్ట్రెస్, మానసిక అలసట ఏర్పడుతుంది. చదువు అనేది ఆనందంగా ఉండాలి కానీ భయంగా మారుతుంది. పిల్లలకు హాబీలు, విశ్రాంతి, సామాజిక కార్యక్రమాలకు కూడా సమయం కావాలి. ప్రయత్నాన్ని ప్రశంసించడం మంచిది కానీ పర్ఫెక్షన్ డిమాండ్ చేయకూడదు.

పిల్లల మానసిక అవసరాలను నిర్లక్ష్యం చేయడం

చాలా మంది తల్లిదండ్రులు మార్కులు, చదువు ఫలితాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కానీ పిల్లలు మానసిక మద్దతు, ప్రేమ, పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడడం, కూడా కోరుకుంటారు. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు చదువు ఏకాగ్రత తగ్గుతుంది. పిల్లలు ఇంట్లో మానసికంగా ఒంటరిగా ఉంటే చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. వారి భావాలను ఓర్పుతో వినడం చాలా అవసరం.

Advertisement

Also Read: తొలి పరిచయంలోనే అందరి మనుసులను గెలవాలనుకుంటున్నారా? దీని కోసం చాణక్యుడు చెప్పిన మంత్రం ఇదే

కఠినంగా శిక్షించడం, తిట్టడం

కొందరు తల్లిదండ్రులు చదువు సమయంలో అరవడం, శిక్షించడం లేదా కఠినంగా మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన పిల్లల్లో భయాన్ని పెంచి చదువును ఇష్టపడకుండా చేస్తుంది. ప్రశాంతంగా మాట్లాడి మార్గదర్శకత్వం చేయడం చాలా మంచి విధానం. పిల్లలకు నేర్పేందుకు భయాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

పిల్లల నేర్చుకునే విధానాన్ని అర్థం చేసుకోకపోవడం

ప్రతి పిల్లవాడికి వేర్వేరు నేర్చుకునే స్టైల్ ఉంటుంది. కొందరు చూడడం ద్వారా, మరికొందరు చేతులతో చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఈ తేడాలను పట్టించుకోకపోతే పిల్లలు నిరాశ చెంది చదువు అంటే ఆసక్తి కోల్పోతారు. పిల్లలు ఏ విధంగా సులభంగా నేర్చుకుంటున్నారో గమనించి దాని అనుగుణంగా మార్చుకోవాలి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×