E-Paper
Advertisement

ట్విశా శర్మ కేస్.. తల్లిదండ్రులు తమ కూతురికి ఈ విషయాలు నేర్పడం తప్పనిసరి.. పెళ్లి తరువాత అమ్మాయిలు

ట్విశా శర్మ కేస్.. తల్లిదండ్రులు తమ కూతురికి ఈ విషయాలు నేర్పడం తప్పనిసరి.. పెళ్లి తరువాత అమ్మాయిలు
Advertisement

ఇటీవల దేశంలో జరిగిన వరకట్న వేధింపులు, గృహ హింస కేసులు చూసి అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ట్విశా శర్మ అనే యువతి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆమె మరణించడం.. ఆమెను భర్త, అత్త, మామలు వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత అమ్మాయిల భద్రత భయపడే పరిస్థితులున్నాయి. పెళ్లి అనేది జీవితంలో పెద్ద మార్పు. కొత్త కుటుంబం, కొత్త బాధ్యతలు, కొత్త పరిస్థితులు అమ్మాయిల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అందుకే తల్లిదండ్రులు ముందుగానే కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పాలి. ఈ పాఠాలు అమ్మాయిలకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, భద్రతను ఇస్తాయి.

ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో చెప్పాలి

ప్రతి అమ్మాయి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా అవమానించినా, అసభ్యంగా మాట్లాడినా.. మౌనంగా భరించకూడదని తల్లిదండ్రులు చెప్పాలి. అత్తింట్లో ఏదైనా విషయం బాధపెడుతున్నట్లు ఉన్నా.. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే కుటుంబంతో పంచుకోవాలని నేర్పాలి. బాధను మనసులో పెట్టుకోవడం మరింత కష్టం తెస్తుంది. తల్లిదండ్రుల మద్దతు ఉందనే నమ్మకం అమ్మాయికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నప్పుడు ఆమె సరైన నిర్ణయాలు తీసుకోగలదు.

తన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని నేర్పాలి

Advertisement

పెళ్లి తర్వాత చాలామంది అమ్మాయిలు ఉద్యోగం లేదా తమ అభిరుచులను వదిలేస్తారు. ఇది సరైన విషయం కాదు. అమ్మాయిలు తమ కెరీర్‌ను కొనసాగించాలని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం చాలా అవసరం. ఉద్యోగం మాత్రమే కాదు, తన అభిప్రాయాలు, లక్ష్యాలను కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కుటుంబ బాధ్యతలతో పాటు తన వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పాలి.

ఆర్థికంగా బలంగా ఉండాలని నేర్పాలి

డబ్బు విషయంలో స్వతంత్రంగా ఉండడం.. మహిళలకు చాలా ముఖ్యం. ఇది వారికి మానసిక భద్రతనిస్తుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు నేర్పాలి. అమ్మాయి తన పేరుతో బ్యాంక్ ఖాతా నిర్వహించడం అవసరం. ఖర్చులు ఎలా నియంత్రించాలో కూడా చెప్పాలి. చాలామంది మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం వల్ల సమస్యల్లో ఇరుక్కుంటారు. కానీ ఆర్థిక బలం ఉంటే కష్టకాలంలో ధైర్యంగా నిలబడగలరు.

ఎప్పుడైనా ఇంటికి రావచ్చని భరోసా ఇవ్వాలి

Advertisement

చాలామంది అమ్మాయిలు.. తమ అత్తారింట్లో సమస్య ఉంటే పుట్టింటికి వెళ్లిపోవడం తప్పు అని భావిస్తారు. ఈ భయాన్ని తల్లిదండ్రులు తొలగించాలి. ఎలాంటి కష్ట పరిస్థితి వచ్చినా ఎప్పుడైనా ఇంటికి రావచ్చని స్పష్టంగా చెప్పాలి. బాధను జీవితాంతం భరించడం కంటే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. తల్లిదండ్రుల మద్దతు అమ్మాయికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె ఒంటరిగా లేనని భావిస్తుంది.

Also Read: మీ పిల్లాడు కూడా క్లాస్ టాపర్ కాగలడు.. చదువు పట్ల ఆసక్తి కలిగించే టిప్స్

చిన్న చిన్న అలవాట్లు మనో ధైర్యాన్ని పెంచుతాయి

ఇలాంటి విషయాలపై చిన్నప్పటి నుంచే కుటుంబంలో చర్చలు జరగాలి. నిజ జీవిత ఉదాహరణలు చెప్పాలి. అమ్మాయి ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. అవసరమైతే క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ చేయించాలి. ఏదైనా తప్పు జరిగితే అది తప్పు అని ధైర్యంగా చెప్పడం కూడా నేర్పాలి. ఇలా చేయడం వల్ల అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది

పెళ్లి అయ్యాక కూడా తల్లిదండ్రుల బాధ్యత పూర్తవదు. కూతురితో తరచూ మాట్లాడాలి. ఆమె భావాలను తెలుసుకోవాలి. చిన్న చిన్న పరామర్శలు కూడా ఆమెకు పెద్ద భరోసా ఇస్తాయి. ఈ మద్దతు వల్ల అమ్మాయిలు తమ సమస్యలను భయపడకుండా చెప్పగలుగుతారు. తల్లిదండ్రుల ప్రేమ, అండతో అమ్మాయిలు సురక్షితంగా, సంతోషంగా జీవించగలరు.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×