E-Paper
Advertisement

Shubman Gill Century: గిల్ అదిరిపోయే సెంచ‌రీ..ఫైనల్స్ లోకి గుజ‌రాత్ టైటాన్స్‌

Shubman Gill Century: గిల్ అదిరిపోయే సెంచ‌రీ..ఫైనల్స్ లోకి గుజ‌రాత్ టైటాన్స్‌
Advertisement

Shubman Gill Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. న్యూ చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ కీలక మ్యాచ్ లో ఆది నుంచి చివరి వరకు ఆధిపత్యం చెలాయించిన‌ గుజరాత్ టైటాన్స్, రాజ‌స్థాన్ పై విజ‌యం సాధించి, ఫైన‌ల్స్ లోకి దూసుకెళ్లింది. ఇక ఈ బిగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill Century) సెంచరీ కూడా నమోదు చేశాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీతో చెలరేగి, రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించాడు. అయితే గిల్ సెంచరీ చేసిన వెంటనే ఆయన తండ్రి లఖ్వీందర్ సింగ్ గిల్ ( Lakhwinder Singh Gill) వీఐపీ గ్యాలరీ నుంచి తొడగొడుతూ కనిపించారు. శభాష్ బేటా అంటూ గర్వంగా ఫీల్ అయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్, సూపర్ విక్టరీ నమోదు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ పైన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరు వికెట్లు నష్టపోయిన రాజస్థాన్ రాయల్స్… 215 పరుగుల భారీ టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ ముందు పెట్టింది.

అయితే ఈ టార్గెట్ చేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ సూపర్ సెంచరీ తో రెచ్చిపోయాడు. అటు సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు నష్టపోయి మ్యాచ్ గెలిచింది గుజరాత్ టైటాన్స్. ఇక ఎల్లుండి మే 31వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.

తొడ‌గొట్టిన‌ గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్

Advertisement

గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్స్ కు చేర్చే క్రమంలో గిల్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో మూడు సిక్సర్లు, 15 బౌండరీలతో సెంచరీ సాధించాడు. అయితే గిల్ సెంచరీ చేసిన సందర్భంగా ఆయన తండ్రి లఖ్వీందర్ సింగ్.. తొడగొట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సింగ్ ఇజ్ కింగ్ అంటూ ర‌చ్చ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

 

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×