E-Paper
Advertisement

ఇలాంటి రొమాంటిక్ సినిమాలు చూస్తే బుర్ర పాడైపోద్ది… పిల్లలతో అస్సలు చూడొద్దు

ఇలాంటి రొమాంటిక్ సినిమాలు చూస్తే బుర్ర పాడైపోద్ది… పిల్లలతో అస్సలు చూడొద్దు
Advertisement

Romantic Movies on OTT : సినిమాల్లో రొమాన్స్ అనగానే కేవలం పాటలు, ఫైట్లు, హ్యాపీ ఎండింగ్స్ మాత్రమే కాదు. కొన్ని సినిమాలు అంతకుమించి ఎమోషన్స్ తో మాటల్లో చెప్పలేని గాఢమైన ప్రేమని చూపిస్తాయి. అలాంటి అద్భుతమైన ఆరు ప్రపంచ స్థాయి రొమాంటిక్ చిత్రాలు, వాటి స్ట్రీమింగ్ వివరాలపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. అయితే ఇవి పిల్లలతో కలిసి చూసే సినిమాలు కావు, పరిణితి చెందిన ప్రేమికులు మాత్రమే ఆస్వాదించదగిన మాస్టర్‌పీస్‌లు.

1. పాస్ట్ లైవ్స్ (Past Lives – 2023)

బాల్య స్నేహితులైన నోరా, హే సంగ్ చిన్నప్పుడే విడిపోతారు. 24 సంవత్సరాల తర్వాత న్యూయార్క్‌లో మళ్ళీ కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య ఉండే బంధం, మనం కలిసి ఉంటే ఎలా ఉండేదనే ఆలోచనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది హృదయాన్ని మెలిపెట్టే ఒక ఆధునిక ప్రేమ కావ్యం. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో దీనిని చూడచ్చు.

2. బిఫోర్ సన్‌సెట్ (Before Sunset – 2004)

Advertisement

‘బిఫోర్ సన్‌రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఒక అద్భుతం. తొమ్మిదేళ్ల తర్వాత ప్యారిస్‌లో కలుసుకున్న జెస్సి, సెలిన్ కేవలం నడుస్తూ, మాట్లాడుకుంటూనే ఉంటారు. వారి సంభాషణల్లోనే ప్రేమ, జీవితం, పశ్చాత్తాపం అన్నీ కనిపిస్తాయి. మాటల ద్వారానే రొమాన్స్ పండించవచ్చని నిరూపించిన చిత్రమిది. జియో సినిమా (JioCinema), యాపిల్ టీవీ (Apple TV )లో ఇది అందుబాటులో ఉంది.

3. ఇన్ ది మూడ్ ఫర్ లవ్ (In the Mood for Love – 2000)

హాంగ్‌కాంగ్ నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ రొమాంటిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమ పార్ట్నర్స్ తమను మోసం చేస్తున్నారని తెలిసిన ఇద్దరు పొరుగువారు ఒకరికొకరు దగ్గరవుతారు. సమాజం కోసం వాళ్ళు తమ ప్రేమను అణచుకునే తీరు, ఇందులోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుడిని ఇంకొక లోకంలోకి తీసుకెళ్తాయి. మ్యుబి (MUBI), యాపిల్ టీవీ (Apple TV)లో ఇది అందుబాటులో ఉంది.

4. పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ ఆన్ ఫైర్ (Portrait of a Lady on Fire – 2019)

Advertisement

18వ శతాబ్దపు ఫ్రాన్స్ నేపథ్యంలో సాగే ఇద్దరు మహిళల (ఒక చిత్రకారిణి, ఒక వధువు) మధ్య చిగురించిన ప్రేమకథ ఇది. మాటల కంటే చూపులతో, శ్వాసతో రొమాన్స్ ఎలా పండించవచ్చో దర్శకురాలు సెలిన్ సియామా ఇందులో చూపించారు. ఇదొక విజువల్ వండర్. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇది అందుబాటులో ఉంది.

5. బ్రోక్‌బ్యాక్ మౌంటైన్ (Brokeback Mountain – 2005)

ఇద్దరు కౌబాయ్స్ మధ్య దశాబ్దాల పాటు సాగే సున్నితమైన ప్రేమకథ ఇది. హృదయాన్ని పిండేసే క్లైమాక్స్, నటీనటుల అద్భుత ప్రదర్శన ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ప్రేమికులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీనిని చూడచ్చు.

6. త్రీ కలర్స్: రెడ్ (Three Colours: Red – 1994)

యాదృచ్ఛికంగా కలుసుకున్న ఒక యంగ్ మోడల్, ఒక రిటైర్డ్ జడ్జ్ మధ్య ఏర్పడే ఆత్మీయ బంధం చుట్టూ ఈ ఫ్రెంచ్ సినిమా తిరుగుతుంది. ప్రేమలోని విభిన్న కోణాలను, ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా చూపంచారు. ముబి (MUBI), యూట్యూబ్ (YouTube Movies) లో ఇది స్ట్రీమింగ్ లో ఉంది. వీటిని పిల్లలకు దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా లేదా మీ భాగస్వామితో కలిసి చూస్తే మస్త్ ఫీలింగ్ ఉంటుంది.

Read Also : ఊళ్ళో చర్మం లేకుండా పుట్టే పిల్లలు… తల్లిదండ్రులే చంపి ఇదేం దారుణం భయ్యా ?

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×