E-Paper
Advertisement

Pecan Nuts Benefits: అమ్మో.. పీకాన్ గింజల్లో ఇంత పవర్ ఉందా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు!

Pecan Nuts Benefits: అమ్మో.. పీకాన్ గింజల్లో ఇంత పవర్ ఉందా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు!
Advertisement

Pecan Nuts Benefits: పీకాన్ నట్స్ అంటే కొంతమందికి కొత్తగా వినిపించే పేరు కావచ్చు. కానీ వీటిలో ఉన్న పోషకాల బలం వలన నిజానికి పీకాన్ నట్స్‌ను ‘సూపర్ ఫుడ్’ అని చెప్పవచ్చు. తీపి వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా.. మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.  ఈ పీకాన్ నట్స్ మన గుండె ఆరోగ్యం, మెదడు, జీర్ణవ్యవస్థ, రక్తంలో షుగర్ స్థాయిలను కాపాడటంలో ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు ఈ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూసేద్దాం..

ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:

* పీకాన్ నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఒలిక్ యాసిడ్ వంటి మోనో అన్‌సేచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.

Advertisement

Read Also: మధుమేహం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. సూపర్ ఫుడ్‌గా నిలుస్తున్న డ్రాగన్ ఫ్రూట్!

* విటమిన్ E, పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పీకాన్ నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, కణజాలాల నష్టాన్ని నివారించి, వృద్ధాప్య ఛాయలను నెమ్మదింపజేస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ అందించడంలో పీకాన్ నట్స్ కీలకం.

Advertisement

* ఇకపోతే పీకాన్ గింజలు E విటమిన్‌కు అద్భుతమైన వనరు. ఇది మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే అల్జీమర్స్ వంటి న్యూరోడిజనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు.. ఈ గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల, జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారించి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

* ఈ నట్స్‌ను మీ రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే.. పీకాన్ నట్స్ ఎక్కువగా ఆకలి వేయడాన్ని నియంత్రిస్తుంది.  దీంతో ఎక్కువ కేలరీలు తీసుకోకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

* ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలోనూ సహాయపడతాయి. పీకాన్ నట్స్‌లో ఉండే ఫైబర్.. ఆరోగ్యకరమైన కొవ్వులు గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తాయి, తద్వారా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

*  పీకాన్మె నట్ప్ మెగ్నీషియం నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి కండరాల తిమ్మిరిని నివారిస్తుంది. మాంగనీస్, రాగి వంటి ముఖ్య ఖనిజాలు జీవక్రియ ప్రక్రియలకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. పీకాన్ నట్స్ ఈ ఖనిజాలకు అద్భుతమైన వనరు.

Read Also: రెగ్యులర్‌గా బ్లాక్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎలాంటి రోగాలైనా పారిపోవాల్సిందే!

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×