E-Paper
Advertisement

Toothbrush Freezing: ఆ దేశాల్లో జనం టూత్ బ్రష్‌లను ఫ్రిజ్‌లో పెడుతున్నారు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Toothbrush Freezing: ఆ దేశాల్లో జనం టూత్ బ్రష్‌లను ఫ్రిజ్‌లో పెడుతున్నారు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు!
Advertisement

Toothbrush Freezing: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వింత ట్రెండ్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రాత్రంతా ఫ్రిజ్‌లో టూత్ బ్రష్ ఉంచి ఉదయాన్నే దాంతో పళ్లు శుభ్రం చేయడం. ఇదిలా ఉంటే కాలిఫోర్నియా, స్టాక్ హోం, సియోల్ వంటి నగరాల్లో ఈ పద్దతిని ఫాలో అవుతూ తీసిన వీడియోలకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫ్రిజ్ లో పెట్టిన బ్రష్‌తో పళ్లు శుభ్రం చేస్తే నోటిలోని బ్యాక్టీరియా చనిపోతుందని అంతే కాకుండా చిగుళ్ల వాపు కూడా తగ్గుతుందని పళ్లపై ఉన్న మరకలు కూడా తొలగిపోతాయని నెటిజన్లు చెబుతున్నారు. ఇంతకీ దీని గురించి సైన్స్ ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణులు ఏం అంటున్నారు ?

Advertisement

ముంబైకి చెందిన ఓ డెంటిస్ట్ ఈ ట్రెండ్ గురించి స్పష్టతనిచ్చారు. చిగుళ్ల వాపు అనేది బ్యాక్టీరియా పేరుకు పోవడం వల్ల వస్తుందని దీనిని బ్రష్ కూలింగ్‌తో నయం చేయలేమని తెలిపారు.

బ్యాక్టీరియా ప్రభావం:
బ్రష్ ఫ్రీజ్ చేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ బ్యాక్టీరియాను చంపడానికి గడ్డ కట్టే ఉష్ణోగ్రత పనిచేయదు. చల్లదనం వల్ల బ్యాక్టీరియా తాత్కాలికంగా మొద్దుబారిపోతుంది. కానీ ఒక సారి బ్రష్ బయటకు తీసి నోట్లో పెట్టగానే శరీర ఉష్ణోగ్రతకు అవి మళ్లీ సజీవం అవుతాయి. దీని వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

చిగుళ్ల వాపు:
గడ్డ కట్టిన బ్రష్ వాడినప్పుడు చిగుళ్లు కూడా మొద్దుబారతాయి. ఫలితంగా కొంత సేపు హయిగా అనిపిస్తుంది. కానీ ఇది నొప్పిని తక్కువ సమయం మాత్రమే మరుగున ఉంచుతాయి.. తప్ప చిగుళ్ల వాపుకు కారణం అయిన అసలు సమస్యలను పరిష్కరించదు. ఇదిలా ఉంటే సెన్సివిటి ఉన్న వారికి బ్రష్ ఎక్కువ చల్లగా ఉంటే.. విపరీతమైన నొప్పి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ప్లాక్ బయోఫిల్మ్:
ప్లాక్ అనేది పళ్లపై పేరుకుపోయిన ఒక పొర. ఇది కేవలం బ్రష్‌తో చేసే రాపిడి ద్వారా మాత్రమే తొలగిపోతుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న బ్రష్ వాడినప్పుడు ఈ పొర ఊడిపోతుందనుకోవడం అపోహ మాత్రమే అని డాక్టర్లు చెబుతున్నారు. అంతే కాకుండా దీని వల్ల ఫలితం అంతగా ఉండదని అంటున్నారు.

చిగుళ్ల ఆరోగ్యం కోసం ఏం చేయాలి ?

సరైన బ్రషింగ్: రోజుకు రెండు సార్లు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో పళ్లు శుభ్రం చేయాలి.
ఫ్లోసింగ్:పళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలను తొలగించడానికి ఫ్లోసింగ్ లేదా ఇంటర్ డెంటల్ క్లీనింగ్ చేయాలి.
రెగ్యులర్ చెకప్: 6 నెలలకు ఒకసారి తప్పకుండా డెంటిస్టును కలిసి ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవాలి.
శుభ్రత:నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×