E-Paper
Advertisement

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలు ఈమేనా?.. అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షం

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలు ఈమేనా?.. అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షం
Advertisement

Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె జు ఏ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గత మూడేళ్లుగా కిమ్ తో పాటు ఆయన కుమార్తె తరుచూ మీడియాలో కనిపించడం.. ఈ ఊహాగానాలను ఊతం ఇస్తుంది. మాజీ నాయకులకు నివాళులు అర్పించే కుమ్సుసాన్ సమాధి వద్ద కొత్త సంవత్సరంలో తొలిసారి తల్లిదండ్రులతో కలిసి కనిపించింది జు ఏ. ఉత్తరకొరియాకు నాల్గవ తరం నాయకురాలిగా జు ఏ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సెజాంగ్ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చియోంగ్ సియోంగ్-చాంగ్, కుమ్సుసాన్ ప్యాలెస్‌లో జు ఏ మొదటిసారిగా అడుగుపెట్టడంతో పాటు, త్వరలో జరిగే పాలక పార్టీ కాంగ్రెస్‌కు ముందు ఆమె వారసత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తరచూ అధికారిక కార్యక్రమాల్లో

Advertisement

జనవరి 1న జరిగిన పర్యటనలో కిమ్‌తో పాటు అతని సతీమణి రి సోల్ జు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జు ఏ తన తల్లిదండ్రులతో కలిసి కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ ప్రధాన హాలులో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియా ప్రధాన కార్యక్రమాలలో కిమ్‌తో పాటు అతడి సతీమణి, కుమార్తె తరచూ పాల్గొనడంతో.. కిమ్ తదుపరి వారసత్వానికి సంకేతాలు ఇస్తున్నారని నిపుణులు అంటున్నారు.

Also Read:  ఐస్ క్రీమ్ అనకూడదా? ఇంగ్లీష్ పదాలపై కిమ్ మామ ఆంక్షలు, ఆ పదాలన్నీ బ్యాన్!

తొలిసారిగా న్యూ ఇయర్ వేడుకల్లో

Advertisement

2010లో జన్మించిన కిమ్ జు ఏ.. తొలిసారిగా దేశ అధికారిక నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యారు. సెప్టెంబర్‌లో ఆమె తన మొదటి విదేశీ పర్యటనకు తండ్రితో కిమ్ జోంగ్ ఉన్ తో కలిసి బీజింగ్‌కు వెళ్లింది. అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా రాజవంశ వారసత్వాన్ని ధృవీకరించే సంకేతాల్లో భాగంగా జు ఏ తరచూ బహిరంగంగా కనిపిస్తున్నారంటున్నారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌ కు నివాళులు అర్పించడానికి కిమ్ జోంగ్ ఉన్.. గురువారం కుంసుసాన్‌ను సందర్శించారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×