E-Paper
Advertisement

Actor Tommy Lee: అనుమానాస్పద స్థితిలో స్టార్ హీరో కూతురు మృ*తి

Actor Tommy Lee: అనుమానాస్పద స్థితిలో స్టార్ హీరో కూతురు మృ*తి
Advertisement

Actor Tommy Lee: కొత్త సంవత్సరం రావడంతో సాధారణ ప్రజలనుంచి సెలబ్రిటీల వరకు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. అయితే ప్రముఖ నటుడి ఇంట్లో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న టామీ లీ జోన్స్ (Tommy Lee Jones) కుమార్తె విక్టోరియా జోన్స్ (34) (Victoria Jones)ఆకస్మిక మరణం సంచలనం రేపుతోంది.. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 1 తెల్లవారుజామున ఫెయిర్‌మాంట్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక హోటల్లో ఈమె విగత జీవిగా పడి ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో నటి విక్టోరియా మరణం..

జనవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున 2.52 గంటలకు మాసన్ స్ట్రీట్ అడ్రస్ కు పారామెడికల్ టీం చేరుకున్నారు. అప్పటికే ఆమె స్పృహ లేకుండా ఉన్నప్పటికీ మెడికల్ టీం సిపీఆర్ చేసి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే విక్టోరియా మరణించి ఉండడంతో ఈ విషయం కాస్త హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. ఇక విక్టోరియా మరణించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటివరకు ఈమె మరణానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. విక్టోరియా తండ్రి టామీ లీ జోన్స్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నప్పటికీ విక్టోరియా మాత్రం సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు.

ఆత్మహత్య చేసుకున్నారా?

Advertisement

ఈమె మొదటిసారి తన తండ్రి 2002లో నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం మెన్ ఇన్ బ్లాక్ 2 లో ఒక చిన్న పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలు టెలివిజన్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన విక్టోరియా గురించి తన తండ్రి ఎప్పుడు ఎంతో గర్వంగా చెబుతూ ఉండేవారు అయితే ఉన్నఫలంగా తన కుమార్తె మరణ వార్త బయటకు రావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఈమె మరణానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. పలువురు ఈ మరణం పై స్పందిస్తూ ఇది ఆత్మహత్య అంటూ భావిస్తున్నారు కానీ సరైన ఆధారాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.

కూతురి మరణంతో విచారంలో నటుడు ..

Advertisement

నటుడు టామీ లీ జోన్స్ మొదటి భార్య కింబర్లీ స్కాట్ లకు విక్టోరియా జన్మించారు. చిన్నప్పటి తన తండ్రి పేరు ప్రఖ్యాతలు కాకుండా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకోవడం కోసం కష్టపడుతూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న విక్టోరియా అకాల మరణం పట్ల ఇప్పటికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో నటుడు టామీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమార్తె మరణం పట్ల ఇప్పటివరకు నటుడి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు.

Also Read: Malavika Mohanan: సలార్ మిస్ చేసుకున్న రాజా సాబ్ బ్యూటీ..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×