E-Paper
Advertisement

Blood Group: కోపం, ద్వేషంతో రగిలిపోతున్నారా.. అయితే మీ బ్లడ్‌గ్రూప్ అదే!

Blood Group: కోపం, ద్వేషంతో రగిలిపోతున్నారా.. అయితే మీ బ్లడ్‌గ్రూప్ అదే!

Blood Group: కొంతమంది చిన్న విషయాలకే కోప్పడిపోతుంటారు. అయితే, కోపం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే.. అదొక భావోద్వేగం. కానీ, సందర్భాన్ని బట్టి దాన్ని నియంత్రించుకోవడం అనేది చాలా ముఖ్యం. కోపం రావడం వెనక బోలెడు కారణాలు ఉండొచ్చు. ఎక్కువగా కోప్పడే మనుషుల చుట్టూ ఉన్న పరిస్థితులు కారణం కావొచ్చు, వారిలోని జన్యువులు, కొన్ని సంస్కృతులు.. ఇలా కారణాలు అనేకం ఉండవచ్చు. అయితే, మనుషుల వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, పట్టరాని కోపాన్ని బ్లడ్‌గ్రూప్ నిర్ణయిస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? ఒక నిర్దిష్ట బ్లడ్‌గ్రూప్ కలిగిన వారికి.. ద్వేషం, పట్టరాని కోపం, మొండితనం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. మరి ఆ బ్లడ్‌గ్రూప్ ఏంటి? దానికి గల కారణాలేంటో.. ఇప్పుడు తెలుసుకుందామా?

ఆగ్రహానికి లోనయ్యేది వీళ్లే:

కొన్ని సంస్కృతులు, సంప్రదాయ నమ్మకాలు, కొన్ని పాత అధ్యయనాల ప్రకారం.. ఇతర బ్లడ్‌ గ్రూప్‌ల వారితో పోలిస్తే.. ‘O+’ బ్లడ్‌గ్రూప్ వారిలోనే ద్వేషం, కోపం, మొండితనం లక్షణాలు ఎక్కువట. ఈ ‘O+’ బ్లడ్‌గ్రూప్ కలిగిన వ్యక్తులు సాధారణంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారట. అదేమాదిరి ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుందట. అయితే, ఈ ఆత్మవిశ్వాసం ఎదుటివారి అభిప్రాయాలను అంగీకరించడంలో మొండితనంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాము అనుకున్నది జరగనప్పుడు లేదా తమ అధికారాన్ని ప్రశ్నించినప్పుడు ఈ ‘O+’ బ్లడ్‌గ్రూప్ వ్యక్తులు త్వరగా కోపానికి లోనవుతారని చెబుతారు నిపుణులు.

ఈ గ్రూప్ వాళ్లు సేఫ్ జోన్:

‘A+’ బ్లడ్‌గ్రూప్ కలిగిన వక్తులు ప్రశాంతంగా, సున్నితంగా, బాధ్యతాయుతంగా ఉంటార. అయితే, లోలోపల మాత్రం ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారట. ‘B+’ బ్లడ్‌గ్రూప్ మనుషులు సృజనాత్మకంగా, స్వేచ్ఛగా, చురుకుగా ఉంటారట. కానీ, కొన్నిసార్లు తమ భావాలు స్థిరంగా లేకపోవడం వల్ల వారిలో ఎక్కువగా భావోద్వేగాలు కనిపించే అవకాశాలు ఉంటాయట.

వీళ్లు ఎవరికీ అర్థం కారు:

ఇక ‘AB+’ బ్లడ్‌గ్రూప్ రక్తం కలిగిన వాళ్లు ప్రశాంతమైన, హేతుబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారట. కానీ, వీరిని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుందని చెబుతారు నిపుణులు. అయితే, ఈ లక్షణాలు కేవలం కొన్ని సాంస్కృతిక నమ్మకాలే తప్ప, శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. చిన్న విషయాలకు కూడా కోపం రావడం అనేది వారి జీవనశైలి, అనుభవాలు పెంపకం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

మన వ్యక్తిత్వం మన చేతుల్లోనే:

ఈ బ్లడ్‌‌గ్రూపుల ద్వారా వ్యక్తిత్వాలను నిర్ణయించడం అనేది ఒక ఆసక్తికరమైన నమ్మకం మాత్రమే. మనుషుల కోపం లేదా స్వభావం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన బ్లడ్‌ గ్రూప్‌ కంటే, మనం నేర్చుకునే విషయాలు, చుట్టూ ఉన్న వాతావరణం, భావోద్వేగాలను నియంత్రించుకునే విధానంపైనే ఈ పట్టరాని కోపం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే, ఆ కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకుంటున్నాం అనేది నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే.

కోపాన్ని అదుపు చేసే మార్గాలు:

* మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కోపం వచ్చినప్పుడల్లా.. దీర్ఘశ్వాస తీసుకుంటూ 10 వరకు అంకెలను లెక్క పెట్టండి.
* మీకు ఏ విషయంలో అయినా పట్టరాని కోపం వచ్చినప్పుడు.. కాసేపు వాకింగ్ చేయండి.
* కోపంలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సంగీతం వినండి. దీంతో మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.
* కోపంలో ఉన్నప్పుడు ఆల్కహాల్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం మానేయాలి.
* ఎవరిమీదైనా మీకు కోపం వస్తే.. ఓ కునుకు తీయండి అంతా సెట్ అయిపోతుంది.
* అప్పటికీ మీ కోపం తగ్గకపోతే.. ఎవరూ లేని గదిలో గట్టిగా అరవండి లేదా కేకలు వేయండి.
* మీ కోపాన్ని మీరే నియంత్రించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు.. వైద్యున్ని సంప్రదించండం ఉత్తమం.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×