Argument In Bengaluru: చిన్న గొడవలే తీవ్ర వాగ్వాదానికి దారితీసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ రేజ్ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల తమ కారుకు బైక్ తగిలించాడనే కారణంతో ఓ యువకుడిని ఓ దంపతులు హత్య చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ క్యాబ్ డ్రైవర్ తన కారుతో మోటార్ బైకును ఢికొట్టాడు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో కేఆర్ పురం వంతెన సమీపంలో జరిగిన ఈ ఘటనలోఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న బైక్ అనుకోకుండా క్యాబ్‌ను ఢీకొట్టడంతో ఘర్షణ ప్రారంభమైంది. దీంతో డ్రైవర్‌కు, రైడర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది.ఈ ఘటన జరుగుతుండగా వెనకాల మరో కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయిన ఫుటేజ్‌లో బైకర్ ఫ్లైఓవర్‌పై క్యాబ్ పక్కన ఆగి డ్రైవర్‌కు సైగ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది సమాయం తర్వాత, క్యాబ్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా తన కారును మోటార్‌సైకిల్‌లోకి దూసుకెళ్లినట్లు వీడియోలో చూడొచ్చు. దీంతో ఇద్దరు రైడర్లు బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయారు. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్, కారు దిగి బైకర్లతో వాదిస్తూ బైక్ నుండి కీని లాక్కున్నాడని ఎక్స్‌లో ఓ యూజర్ పేర్కొన్నాడు. అయితే ఇద్దరు మైనర్ దెబ్బలతో బయటపడ్డారని సమాచారం.
ఈ ఘటనపై బెంగళూరు పొలీసులు స్పందిస్తూ.. ఈ వీడియోను సుమోటాగా తీసుకొని క్యాబ్ డ్రైవర్ పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. చిన్న చిన్న గొడవలకు ఇలా స్పందించే కారు డ్రైవర్లకు బుద్ది చెప్పాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
No end to the #RoadRage menace in Bengaluru, heated argument between a biker and a cabbie over giving way turns dangerous as the cab driver deliberately rams into the bike near KR Puram. Both escaped with minor injuries. Cops reached out to biker who refused to file a complaint. pic.twitter.com/NDf1EaN5nm
— Deepak Bopanna (@dpkBopanna) November 2, 2025