Sandeep Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సందీప్ రెడ్డి(Sandeep Reddy)ఒకరు. ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ రెడ్డి అనంతరం ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ కొట్టారు. ఇక త్వరలోనే ప్రభాస్ తో స్పిరిట్(Spirit) సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోనుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా సందీప్ రెడ్డి రాంగోపాల్ వర్మ (Ram Gopal Varr)దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna)హీరోగా నటించిన శివ సినిమా(Shiva Movie )గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నాగార్జున ,అమల హీరో హీరోయిన్లుగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ సినిమా అభిమానులకు కల్ట్ క్లాసిక్ మూవీ అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాని నవంబర్ 14వ తేదీ రీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ నేను చిన్నప్పుడు శివ సినిమా చూశాను ఈ సినిమాలో యాక్షన్ సన్ని వేషాలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కథ, నేపథ్యం, మ్యూజిక్ అన్ని నన్ను బాగా ఆకట్టుకున్నాయని సందీప్ రెడ్డి తెలిపారు. రాంగోపాల్ వర్మ డైరెక్షన్, నాగార్జున గారి లుక్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయని, శివ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ నా మైండ్ నుంచి పోవు అంటూ సందీప్ రెడ్డి తెలిపారు. నేను దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చాను అంటే శివ సినిమా నాలో నింపిన స్ఫూర్తి కారణమని సందీప్ రెడ్డి తెలిపారు.
ఇక ఈ సినిమా తిరిగి నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే విషయం తెలియగానే సినిమా కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని సందీప్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ ఈ సినిమా ఇంపాక్ట్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ రెడ్డి కూడా సినిమా గురించి మాట్లాడటంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. శివ సినిమా 1990వ సంవత్సరంలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.