E-Paper
Advertisement

రెస్టారెంట్ స్టైల్ మఖాన కర్రీ..ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!

రెస్టారెంట్ స్టైల్ మఖాన కర్రీ..ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!
Advertisement

Makhana masala curry recipe:  ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ డైట్‌లో ఆరోగ్యకరమైన పదార్ధాలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో.. ‘ఫుల్ మఖాన’ లేదా తామర గింజలు ముందు వరుసలో ఉంటాయి. కేవలం స్నాక్స్ లాగే కాకుండా.. వీటితో తయారు చేసే మసాలా కర్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. క్రీమీ గ్రేవీతో తయారయ్యే ఈ మఖానా కూర చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, తినడానికి అంతకంటే అద్భుతంగా ఉంటుంది. గూగుల్ ఫుడ్ ట్రెండ్స్ ప్రకారం ఈ రుచికరమైన కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

Advertisement

ఫుల్ మఖాన (తామర గింజలు) – 2 కప్పులు

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి లేదా పేస్ట్ చేసినవి)

Advertisement

టమాటాలు – 3 (ప్యూరీ లేదా మెత్తగా రుబ్బినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

జీడిపప్పు – 10-12 (నానబెట్టి పేస్ట్ చేయాలి)

కసూరి మేతి (మెంతి ఆకులు) – 1 స్పూన్

ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ – 3 స్పూన్లు

పసుపు – చిటికెడు

కారం – రుచికి సరిపడా

ధనియాల పొడి – 1 స్పూన్

గరం మసాలా – అర స్పూన్

నూనె లేదా నెయ్యి – 3 స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర – తరిగింత

తయారీ విధానం:

1.ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఫుల్ మఖానాలను అందులో వేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో.. ఉంచి దోరగా వేయించాలి. మఖానాలు క్రిస్పీగా మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. (ఒక మఖానాను చేతితో నలిపి చూస్తే విరిగిపోవాలి).

2. అదే ప్యాన్‌లో మరో రెండు స్పూన్ల నూనె లేదా నెయ్యి వేయాలి. అందులో జీల కర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత సన్నగా.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

Also Read: నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

3. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ప్యూరీని.. వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు అన్నీ బాగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీడి పప్పు పేస్ట్ వేసి కలపాలి. ఇది కర్రీకి రిచ్ క్రీమీ టెక్శ్చర్‌ను ఇస్తుంది.

4. గ్రేవీకి తగినన్ని నీళ్లు (సుమారు ఒక కప్పు) పోసి మరగనివ్వాలి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న మఖానాలను అందులో వేయాలి. మఖానాలు గ్రేవీని పీల్చుకుని.. మెత్తగా మారతాయి. చివరిగా.. కసూరి మేతిని చేతితో నలుపుతూ వేయాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ , గరం మసాలా వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తి మీరతో గార్నిష్ చేయాలి.

ఈ గుమగుమలాడే ఫుల్ మఖాన మసాలా కర్రీ వేడి వేడి అన్నంలోకి, పొగలు కక్కే చపాతీల్లోకి.. లేదా ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీలోకి అద్భుతమైన కాంబినేషన్‌గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ రుచిని మీ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎంజాయ్ చేయండి మరి.

Related News

పాలతో ఇంట్లోనే అదిరిపోయే కలాకండ్..నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!

అమ్మమ్మ కాలం నాటి అరుదైన వంటకం.. వెదురు చిగుళ్ల కూర తింటే ఇన్ని లాభాలా?

దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, గిలిగింతలు పెట్టడం చేస్తున్నారా? పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేయకూడదు

నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

పీతలను ఇలా మసాలా పెట్టి వండితే.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది!

ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈ ఆదివారం ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యానీ ట్రై చేయండి!

మనుషులను వణికిస్తున్న ‘షమోండా వైరస్’.. తొలి మరణం నమోదు, అసలేంటీ వింత వ్యాధి?

Big Stories

Advertisement
×