E-Paper
Advertisement

ప్రసవానంతరం పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఇవే!

ప్రసవానంతరం పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఇవే!
Advertisement

Postpartum Weight Loss: తల్లి కావడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి, కానీ ప్రసవం తర్వాత శరీరంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా.. పెరిగిన బరువు చాలా మంది మహిళలను ఆందోళనకు గురి చేస్తుంది. గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. దీనికి సహనం, సరైన ప్లాన్ అవసరం. పాలిచ్చే తల్లులు కఠినమైన డైటింగ్ చేయకుండా.. బిడ్డ ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా.. శాస్త్రీయ పద్ధతుల్లో బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రసవానంతరం బరువు తగ్గడానికి బెస్ట్ మార్గాలు:

Advertisement

1. తల్లి పాలు ఇవ్వడం :
బరువు తగ్గడానికి ‘బ్రెస్ట్ ఫీడింగ్’ ఒక సహజమైన మార్గం. పాలివ్వడం వల్ల తల్లి శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చవుతాయి. పరిశోధనల ప్రకారం.. పాలిచ్చే తల్లులు రోజుకు సుమారుగా 300 నుంచి 500 కేలరీలను అదనంగా ఖర్చు చేస్తారు. ఇది గర్భాశయం తిరిగి పాత స్థితికి రావడానికి కూడా సహాయ పడుతుంది.

2. పౌష్టికాహారం -క్రష్ డైటింగ్ వద్దు:
బిడ్డ పుట్టిన వెంటనే బరువు తగ్గాలనే ఆరాటంతో భోజనం మానేయకూడదు. దీని వల్ల నీరసం రావడమే కాకుండా పాలు సరిగ్గా పడవు.

Advertisement

ఏం తినాలి: పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ తీసుకోండి.

ప్రోటీన్: పప్పులు, గుడ్లు, పాలు, సోయా వంటి ప్రోటీన్ ఆహారం ఆకలిని నియంత్రించి కండరాల పుష్టికి సహాయ పడుతుంది.

చిన్న చిన్న మొత్తాల్లో: రోజుకు మూడు సార్లు ఎక్కువగా తినే కన్నా.. ఐదు సార్లు తక్కువ మొత్తంలో పోషకాహారం తీసుకోవడం మంచిది.

3. వాకింగ్‌తో ప్రారంభించండి :
ప్రసవం తర్వాత కఠినమైన వ్యాయామాలు వెంటనే చేయకూడదు. ముఖ్యంగా సిజేరియన్ అయిన వారు కనీసం 6-8 వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలి.

డాక్టర్ అనుమతితో.. నెమ్మదిగా వాకింగ్ ప్రారంభించండి.

పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ కండరాలను బలోపేతం చేయడానికి సహాయ పడతాయి.

4. నీరు ఎక్కువగా తాగడం:
బరువు తగ్గడానికి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. అలాగే పాలు పడటానికి కూడా హైడ్రేషన్ ముఖ్యం.

5. సరైన నిద్ర :
చిన్న పిల్లలతో నిద్ర సరిగ్గా ఉండదు. కానీ నిద్రలేమి బరువు పెరగడానికి కారణమవుతుంది. నిద్ర తక్కువైతే.. శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి ఆకలిని పెంచుతుంది. బిడ్డ నిద్రపోయినప్పుడు మీరు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోండి.

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం వంటిది. మీ శరీరం ఒక ప్రాణానికి జన్మనిచ్చింది. కాబట్టి దానిని గౌరవిస్తూ నెమ్మదిగా పాత స్థితికి తీసుకురావాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తేలికపాటి వ్యాయామం, ఒత్తిడి లేని లైఫ్ స్టైల్ ద్వారా మళ్ళీ ఫిట్‌గా మారవచ్చు. ముఖ్యంగా.. సామాజిక మాధ్యమాల్లోని ‘ఇన్‌స్టంట్ వెయిట్ లాస్’ ప్రకటనలను చూసి మోసపోకండి.

గమనిక:

ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసం మాత్రమే. వ్యాయామం లేదా డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.

Related News

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

Big Stories

Advertisement
×