E-Paper
Advertisement

Mini Stroke: పక్షవాతం రాకముందే మేల్కొనండి.. మినీ స్ట్రోక్ లక్షణాలను అస్సలు వదలకండి

Mini Stroke: పక్షవాతం రాకముందే మేల్కొనండి.. మినీ స్ట్రోక్ లక్షణాలను అస్సలు వదలకండి
Advertisement

Mini Stroke: మినీ స్ట్రోక్ లేదా  ‘ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్’ అంటారు. ఇది మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల సంభవిస్తుంది. దీని లక్షణాలు కొన్ని నిమిషాల్లో తగ్గిపోతాయి కాబట్టి, చాలామంది దీనిని సాధారణ అలసటగా భావించి వదిలేస్తారు. కానీ.. మినీ స్ట్రోక్ వచ్చిన వారిలో దాదాపు 30% మందికి అతి త్వరలోనే భారీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ చిన్న హెచ్చరికను గుర్తించి చికిత్స పొందితే ప్రాణాంతక పక్షవాతం నుంచి తప్పించుకోవచ్చు.

మినీ స్ట్రోక్.. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం:

Advertisement

చాలామందికి ఒక్కసారిగా మాట తడబడటం, కంటి చూపు మసకబారడం లేదా చేతులు, కాళ్లు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ అవి కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోవడంతో, “అబ్బే.. ఏం లేదు, ఏదో నీరసం వల్ల అలా అనిపించింది” అని సరిపెట్టుకుంటారు. వైద్య పరిభాషలో దీనినే ‘మినీ స్ట్రోక్’ లేదా TIA  అంటారు. ఇది నిజానికి స్ట్రోక్ కాదు.. కానీ రాబోయే పెద్ద ప్రమాదానికి మెదడు ఇచ్చే ‘అల్టిమేటం’.

మినీ స్ట్రోక్ ఎందుకు వస్తుంది?
మెదడులోని ఏదైనా రక్తనాళంలో చిన్న రక్తపు గడ్డ అడ్డుపడినప్పుడు రక్తప్రసరణ తాత్కాలికంగా ఆగిపోతుంది. అయితే.. ఆ గడ్డ త్వరగానే కరిగిపోవడంతో రక్తప్రసరణ మళ్లీ మొదలై లక్షణాలు మాయమవుతాయి. మేజర్ స్ట్రోక్‌లో అయితే ఆ గడ్డ అలాగే ఉండిపోయి మెదడు కణాలను శాశ్వతంగా దెబ్బతీస్తుంది.

Advertisement

గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు: మినీ స్ట్రోక్‌ను గుర్తించడానికి ‘FAST’ అనే పద్ధతిని గుర్తుంచుకోవాలి.

F (Face): నవ్వినప్పుడు ముఖం ఒకవైపుకు వంగిపోవడం.

A (Arms): రెండు చేతులను పైకి ఎత్తమన్నప్పుడు ఒక చేయి కిందకు జారిపోవడం లేదా మొద్దుబారడం.

S (Speech): మాటలు తడబడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం.

T (Time): ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి.

మినీ స్ట్రోక్ తర్వాత వచ్చే పశ్చాత్తాపం: అనేక కేసుల్లో, మినీ స్ట్రోక్ వచ్చినప్పుడు బాధితులు నడుచుకుంటూనే ఆసుపత్రికి వెళ్లగలరు లేదా తమ పనులు తాము చేసుకోగలరు. లక్షణాలు తగ్గిపోయాయి కదా అని డాక్టరును సంప్రదించరు. కానీ కొన్ని రోజులు లేదా వారాల తర్వాత వచ్చే ‘మేజర్ స్ట్రోక్’ వారిని శాశ్వత పక్షవాతానికి గురిచేస్తుంది లేదా ప్రాణాలను తీస్తుంది. అప్పుడు, “ఆరోజే వెళ్ళి ఉంటే బాగుండేది” అని బాధపడటం కంటే ముందే స్పందించడం మిన్న.

ప్రమాదం ఎవరికి ఎక్కువ?

అధిక రక్తపోటు ఉన్నవారు.

మధుమేహం నియంత్రణలో లేనివారు.

అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారు.

ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు.

Also Read: కళ్ల ముందు నల్లటి చుక్కలు కనిపిస్తున్నాయా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

నివారణ మార్గాలు:
మినీ స్ట్రోక్ వచ్చిన వెంటనే డాక్టర్లు ఇచ్చే రక్తాన్ని పల్చబరిచే మందులు వాడటం వల్ల భారీ స్ట్రోక్ ముప్పును 80% వరకు తగ్గించవచ్చు. అలాగే లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి.

ఉప్పు వినియోగాన్ని తగ్గించి బీపీని అదుపులో ఉంచుకోవాలి.

రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి.

తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

స్మోకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×