E-Paper
Advertisement

BRS Party: గులాబీ పార్టీలో బిగ్ ట్విస్ట్.. త్వరలో హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు.. మరి కేటీఆర్..?

BRS Party: గులాబీ పార్టీలో బిగ్ ట్విస్ట్.. త్వరలో హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు.. మరి కేటీఆర్..?

BRS Party: బ్యూరో స్వేచ్ఛ: హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలోకీలక పదవి ఇస్తారనేది ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? మరి ఏపోస్టు ఇస్తారు? కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తూ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేస్తారా? లేకుంటే హరీష్ రావుకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

విజయం సాధించాలనే లక్ష్యం

బీఆర్ఎస్ పార్టీలో తన్నీరు హరీష్ రావు కీలకంగా మారారు. ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది. ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించినా? ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించినా నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తారని, సక్సెస్ చేస్తారనేది టాక్.అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే హరీష్ రావుకు మున్సిపల్ బాధ్యతలను పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ఖర్చును ఆయన చేతుల మీదుగానే మున్సిపల్ ఇన్ చార్జులు, మాజీ మంత్రులకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతి మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని ఇది మీ పనితీరుకు నిదర్శమని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రావాలంటే కష్టపడాలని..రాజకీయ చతురతను ఈ ఎన్నికల్లో చాటాలని హరీష్ రావు గట్టి వారికి హుకూం జారీ చేస్తున్నట్లు సమాచారం.

కేటీఆర్ పై నమ్మకం లేకనా?

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే అసెంబ్లీ, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓటమిపాలైంది. దీంతో పార్టీ కేడర్ లో మరింత నైరాశ్యం పెరిగింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆశించిన మేరకు 40శాతం స్థానాల్లో విజయం సాధించింది. ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి బూస్టు ఇచ్చినట్లు అయింది.అయితే అర్బన్ ప్రాంతాలు కీలకం కావడం.. పార్టీ భవిష్యత్ సైతం ఆధారపడి ఉండటంతో హరీష్ రావుకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కేటీఆర్ ను కాదని హరీష్ రావుకు కీలక బాధ్యతలు పార్టీలో అప్పగించబోతున్నారా? అనే ప్రచారం ఊపందుకుంది.

Also Read: Feel good Movie: జీవితాన్ని అందంగా చూపించే బెంగాలీ సినిమా… ఐయండిబిలో టాప్ రేటింగ్

ఏ బాధ్యతలు అప్పగింత

పార్టీలో అధ్యక్షుడిగా తర్వాత కీలక పోస్టు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. అయితే హరీష్ రావు కు మరి ఏ కీలక పోస్టు ఇస్తారనేది ప్రచారం జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా? లేకుంటే కేటీఆర్ ను ఉంచి మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు క్రియేట్ చేస్తారా? అనేది ఇప్పుడు పార్టీలో నే చర్చజరుగుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పటి నుంచే పార్టీని గాడిలో పెట్టాలి. పార్టీ కార్యక్రమాలను సైతం స్పీడప్ చేయాలి. అయితే కేటీఆర్ మాస్ పీపుల్స్ ల్ కు కనెక్టు కావడం లేదని, కేవలం అర్బన్ ప్రాంతానికే పరిమితం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే హరీష్ రావుకు పార్టీలో పదవి అప్పగించబోతున్నారా? అనేది ఇప్పుడు చర్చకుదారితీసింది.

నాడు దూరం.. నేడు దగ్గరకు..

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారనే ఆరోపణలతో దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. 6 నెలలకు పైగా హరీష్ రావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అదే హరీష్ రావు చేతుల మీదుగా మున్సిపల్ ఎన్నికల్లో ఫండింగ్ చేయిస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది. అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటనేది ఇప్పుడు పార్టీలోనే చర్చజరుగుతున్నట్లు సమాచారం. అయితే హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుండటంతో పార్టీ నేతలు ఆయనను ఫాలో అవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. నిత్యం పార్టీలోని సీనియర్లు, కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు సైతం హరీష్ రావును కలుస్తున్నారని సమాచారం. భవిష్యత్ లోనూ పదవులు రావాలంటే హరీష్ రావుకు దగ్గర కావడమే మంచిదని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

Also Read: This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 17 సినిమాలు.. ఆ రెండు సినిమాలు మస్ట్ వాచ్..

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×